కర్ణాటక ముఖ్యమంత్రికి.. బియ్యం కష్టాలు?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చే పథకాలలో కూడా రాజకీయం చేస్తున్నట్లుగా సమాచారం. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తుంది. అయితే అక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అంటే రేషన్ కార్డ్ గల ప్రతి వ్యక్తికి 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తారని సమాచారం. అయితే ఇక్కడ 10 కేజీల బియ్యాన్ని పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు.

కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పేదలకు ఇచ్చే ఐదు కిలోల బియ్యానికి జతగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు  ఇస్తుంది అంతే. ఈ బియ్యం పథకానికి 33 రూపాయల 80 పైసలు  కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం 40 రూపాయలకి కొంటున్నట్లుగా సమాచారం. అంటే 33 రూపాయల 80 పైసలు  ఒకవైపు నుండి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే,  బియ్యం సేకరణకు మిగిలిన ఏడు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటున్నట్లుగా సమాచారం.

అయితే ఆంధ్రప్రదేశ్ లో కిలో బియ్యం ఒక్క రూపాయికే ఇస్తున్నారు. తెలంగాణలో అయితే ఈ బియ్యాన్ని ఉచితంగానే ఇస్తున్నారు. అలాగే తెలంగాణలో  మాదిరిగానే కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇదేవిధంగా బియ్యాన్ని ఉచితంగానే ఇస్తున్నారు. మరి కొన్ని రాష్ట్రాల్లో అయితే ఆ ఏడు రూపాయలను కూడా ప్రజల దగ్గర నుండే తీసుకుంటున్నట్లుగా సమాచారం. అలాంటి చోట్ల తాము పెట్టిన ఏడు రూపాయల పెట్టుబడిని కూడా వెనక్కి తీసుకుంటున్నారు.

ఏడు రూపాయలకే మొత్తం పది కేజీల బియ్యాన్ని తామే అందిస్తున్నట్లుగా డ్రామాలాడుతున్నాయి మరికొన్ని రాష్ట్రాలు. అయితే జై రామ్ రమేష్ ఆ ఏడు రూపాయలను కూడా ఇవ్వకుండానే మొత్తం కేంద్రాన్నే భరించమని అంటున్నట్లుగా సమాచారం. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ తాము 5కిలోలు ఇస్తున్నాం కాబట్టి ఈ మాటలను కేంద్రం పట్టించుకోలేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: