రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?

frame రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?

Chakravarthi Kalyan
వ్యాగనార్ గ్రూపు హెడ్ కి, ఇంకా రష్యా సైన్యపు అధ్యక్షుడికి  సైన్యానికి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అది అప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కి తల నొప్పిగా తయారయింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే వ్యాగనార్ గ్రూపు అధ్యక్షుడు రష్యా సైన్యం మీదకి దండెత్తి వచ్చాడట. కానీ అతను చెప్పేది ఏమిటంటే నేను రష్యా మీదకి యుద్ధానికి రాలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మీదకి యుద్ధానికి రాలేదు. నేను నిజానికి వచ్చింది కేవలం రష్యా కు సంబంధించిన సైనిక అధ్యక్షుడు మీదకు మాత్రమే అని ఆయన చెప్తున్నాడు అని తెలుస్తుంది.

నేను రష్యా అధ్యక్షుడు పుతిన్ కి నా సత్తా ఏమిటో చూపించడానికి ఇక్కడ వరకు వచ్చాను. రక్తపాత రహితంగా వెనక్కి వెళ్ళిపోతున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ సందర్భంలోనే ఒక పక్కన రష్యా అధ్యక్షుడిని  గద్దె దింపాలని ప్రయత్నిస్తూ, మరొక వైపు మాస్కో వైపుగా వ్యాగనార్ గ్రూపు అధ్యక్షుడు తన సైన్యాన్ని తీసుకుని వచ్చాడని తెలుస్తుంది. రష్యా దేశపు సైనిక అధ్యక్షుడు సర్గోవ్ కి సరైన అవగాహన లేదు. వాళ్లు కేవలం తెలివి తక్కువ దద్దమ్మలు.  నేను రష్యా అధ్యక్షుడికి వీళ్ళ తెలివి తక్కువ తనాన్ని చూపించడానికి మాత్రమే  వచ్చాను అని ఆయన చెప్పాడట.

అయితే ఇప్పటివరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాగనార్ గ్రూప్ హెడ్ ని ఏమి చేయలేదని తెలుస్తుంది. వ్యాగనార్ గ్రూపు హెడ్ కోరుకునేది ఏమిటంటే రష్యా దేశపు సైనిక అధ్యక్షుని ఇంకా కొంతమందిని మార్చాలని అడుగుతున్నాడట. అయితే పుతిన్  ఈ మార్పులకు ఒప్పుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు వెస్ట్రన్ మీడియా  విధంగా తెలియజేసింది. అయితే గెలాక్సీ జూన్ అనే పుతిన్ మాజీ బాడీగార్డ్ ని ఇప్పుడు సర్గోవ్ ప్లేస్ లో సైనిక అధ్యక్షుడిగా నియమించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇదే జరిగితే పుతిన్ కన్నా వ్యాగన్ఆర్ గ్రూపు అధ్యక్షుడి   పేరే రష్యాలో మారు మ్రోగుతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: