ఉక్రెయిన్ సర్వనాశనమే.. పుతిన్ పంతమా?
ముఖ్యంగా ఆయుధాలను సరఫరా చేసే సమయంలో రహస్యంగా పంపిస్తున్నారు. అయినా రష్యా వాటిని తెలుసుకొని వచ్చే దారిలోనే ధ్వంసం చేసేస్తోంది. ఇలా చేయడం వల్ల ఉక్రెయిన్ యుద్ధంలో సరిగా పాల్గొనలేక పోతుంది. ఉక్రెయిన్ ఇప్పటికే చాలా ప్రాంతాలను రష్యాకు కోల్పోయింది. కానీ ఆ దేశానికి అమెరికా యూరప్ దేశాల సపోర్ట్ ఉండడం వల్ల యుద్ధం లో ఇంకా కొనసాగుతోంది. లేకపోతే ఎప్పుడో పక్కకు తప్పుకోవాల్సిందే.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఒకవేళ నా నాటో దేశంలో చేరితే రష్యాకు ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి రష్యాను అమెరికా యూరప్ దేశాలు కలిసి నాశనం చేయాలని చూస్తాయి. దీన్ని పసిగట్టి ముందుగానే యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎన్ని దేశాలు ఆయుధాలను ఇస్తున్న కూడా ఉక్రెయిన్ రష్యా ను ఎదుర్కోలేక నానా ఇబ్బందులు పడుతోంది.
రష్యాలో పుతిన్ వ్యతిరేక వర్గం ఆర్మీ కొన్ని దాడులు చేసింది. ఆ సమయంలో ఉక్రెయిన్ సైన్యం రష్యా పై రివర్స్ ఎటాక్ చేస్తే బాగుండేదని యూరప్ దేశాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అంతర్గతంగా జరిగినటువంటి దాడుల్లో రష్యాను వాఘ్నర్ ప్రైవేట్ సైన్యం ఇరకాటంలో పెట్టింది.
అయితే ఉక్రెయిన్ కు ఏ రూపకంగా ఆయుధాలు వస్తాయి. ఏ దారి గుండా వస్తున్నాయన్నది రష్యా కనిపెట్టి వాటిని ధ్వంసం చేస్తోంది. రష్యాను ఓడించడం అనే విషయాన్ని పక్కన పెట్టి శాంతి మార్గంలో చర్చలు జరిపితే ఇప్పటికైనా యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే పుతిన్ చేసే దాడితో ఉక్రెయిన్ మొత్తం బూడిదలా మారే అవకాశం ఉంది.