కాంగ్రెస్‌, వైటీపీ.. షర్మిల భవిష్యత్‌ ఇదేనా?

Chakravarthi Kalyan
వైఎస్ షర్మిళ కాంగ్రెస్ లో చేరాలనుకుంటోందని ఆమెపై సోషల్ మీడియాతో పాటు టీవీ ఛానళ్లు కూడా తెగ ప్రచారం చేసేస్తున్నాయి. దీనికి తోడు ఆమె కర్ణాటకలోని కాంగ్రెస్ గెలిచిన తర్వాత అక్కడి అధ్యక్షుడు డీకె. శివకుమార్ కలవడం ఆయనతో మాట్లాడటంతో ఊహగాహనాలకు తెర లేచింది. అయితే వైఎస్సార్ టీపీ పేరుతో ఆమె తెలంగాణలో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మొన్నటి వరకు పోరాడారు. ఉద్యోగాలు ప్రకటనలు ఇవ్వడం లేదని నిరుద్యోగులకు తెలంగాణలో అన్యాయం జరుగుతోందని దీక్ష కూడా చేశారు.

సీఎం కేసీఆర్ ఫ్యామిలీ పై ప్రభుత్వంపై షర్మిళ విమర్శలు తీవ్రమవడంతో ఆమెను చాలా సార్లు అరెస్టు కూడా చేశారు. ఇన్ని రోజులు బాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ లో చేరతారని వార్తలు రావడంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఎవరో కావాలనే ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడమే తన లక్ష్యమని నిరాధార వార్తలు నమ్మవద్దని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

అయితే ఆమె కాంగ్రెస్ చేరుతుందా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వైఎస్సార్ టీపీని కొనసాగిస్తానని చెప్పలేదు. ప్రజలకు క్లారిటీ ఇచ్చిందా.. లేక క్లారిటీతోనే ఉండి ప్రజలకు గందరగోళానికి గురి చేస్తుందా అనేది తెలియడం లేదు. చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా పోరాటం చేస్తుంటాను. నాకు తెలంగాణ ప్రజలకు మధ్య అగాధం సృష్టించేందుకు కొన్ని దుష్ట శక్తుల విఫలయత్నం చేస్తున్నాయని అన్నారు.

పని లేని పసలేని వారికి చెప్పేది ఒక్కటే నా రాజకీయ భవిష్యత్తుపై పెట్టే దృష్టి కేసీఆర్ పాలనపై పెట్టాలని సూచించారు. కేసీఆర్ పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ గురించి తెలపండి. కేసీఆర్ కుటుంబ పాలనను ఎండగట్టండి. నా భవిష్యత్ తెలంగాణ తోనే ఆరాటం పోరాటం తెలంగాణతోనే అని షర్మిల అన్నారు.  అయితే కాంగ్రెస్ లో చేరడం లేదని మాత్రం చెప్పకపోవడం ఇక్కడ గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: