పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?

Chakravarthi Kalyan
పవన్ కళ్యాణ్ జనాల్లో మంచి మాస్ ఇంపాక్ట్ ఉన్న వ్యక్తి. ఆయన స్పీచ్ ల కోసం ఎంతమంది ఆయన ప్రసంగం చూడడానికి వెళ్తారో, అంతకన్నా ఎక్కువ మంది ఆయనను చూడడానికి వెళ్తుంటారు. ఆయన ఉత్తేజపరిచే మాటలు యువతరానికి, ప్రత్యేకించి ఆయన అభిమానులకు ఒక కిక్కును ఇస్తాయి. రాజకీయాలను ఒక కొత్త మార్గంలో తీసుకువెళ్లే ఆలోచన గల వ్యక్తిగా ఆయనను చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు.

ఆయన మాట వాళ్ళకి ఒక నమ్మకం. ఇప్పుడు చాలామంది యువత ఆయనను ఒక అన్న లా భావిస్తారు. ఆ అన్న చెప్పేది వాళ్లకు వేదం. తన జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఆయన ప్రసంగాలు జిల్లాలో ఎక్కడ జరిగితే అక్కడకి వెళ్తూ ఉంటారు. అంత ఫాలోయింగ్ ఆయనకి ఒక్కరికే సొంతం రాజకీయాల్లో. ఆయన ఒక్క మాటను తిప్పి కొట్టడానికి పదిమంది ప్రత్యర్థి పార్టీ వాళ్లు మాట్లాడుతూ ఉంటారంటే ఆయన స్టామినా ఏంటో వాళ్లు చెప్పకనే చెప్తూ ఉంటారు.

అయితే పవన్ కళ్యాణ్ గతంలో నన్ను ఓడించడానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు, ఉన్న ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని అన్నారంట. ఉన్న ఓట్లు కన్నా ఎక్కువ ఓట్లు పడడం అసాధ్యమని కొంతమంది  లెక్కల ప్రకారం చెప్తున్నారు . గాజువాకలో మొన్న ఎలక్షన్లకు ఉన్న ఓట్లు 3,10,011 అయితే  పోలైన ఓట్లు చూస్తే 1,99,284 ఉన్నాయట. పోలింగ్ శాతం 64.28 అని తెలుస్తుంది. అలాంటప్పుడు ఉన్న ఓట్లు కన్నా ఎక్కువ ఓట్లు పడడం ఎలా సాధ్యం‌ అని అడుగుతున్నారు వాళ్ళు.

అలాగే భీమవరంలో ఉన్న ఓట్లు 2,46,624. పోలింగ్ శాతం 77.94. ఇదీ లెక్క. అయితే అక్కడి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏం చెప్తారు అంటే కౌంటింగ్ టైంలో పోల్ అయిన ఓట్లలో ఎనిమిది వేలు ఓట్లు ఎక్కువ వచ్చాయి అని చెప్తున్నారని తెలుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం పైన ఇప్పుడు చర్చ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: