రష్యాను ముంచుతున్న సొంత ఇబ్బందులు?

Chakravarthi Kalyan
వ్యాగనార్ గ్రూపును ఒక మిత్రునిగా భావించి పెంచి పోషించుకుంటూ వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు వ్యాగనార్ గ్రూపు విషయంలో తన ఆలోచనలను మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. దానికి కారణం వ్యాగనార్ గ్రూప్ ప్రవర్తనే అని తెలుస్తుంది. గతంలో వ్యాగనార్ గ్రూప్ కి ప్రభుత్వం తన దగ్గర ఉన్న ఆయుధాలు ఇచ్చి, సైన్యాన్ని ఇచ్చి శక్తివంతంగా తయారు చేసింది. అప్పటికి వ్యాగనార్ గ్రూప్ కి యుద్ధం చేయడానికి సైనికులుగా తమ జైల్లో ఉన్న ఖైదీలను వినియోగించింది రష్యా దేశం.


తనకి ఏవో సొంత అధికారాలు ఉన్నట్లుగా ఇప్పుడు వ్యాగనార్ గ్రూపు ప్రవర్తిస్తున్నట్లుగా తెలు స్తుంది. ఆ ప్రవర్తన తోనే ఇప్పుడు వ్యాగనార్ గ్రూప్ రష్యా సైనికులను నిత్యం విమర్శిస్తూ ఉందని తెలుస్తుంది. మనం మనం కొట్టుకుంటే జనానికి లోకువ అవ్వుతామనే విషయం కూడా మర్చిపోయి మరీ వ్యాగనార్ గ్రూప్ రష్యా సైనికులను తిడుతున్నట్లుగా తెలుస్తుంది. భాగ్పుత్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న క్రెడిట్ తో అవార్డును సొంతం చేసుకున్నాడు వ్యాగనార్ గ్రూప్ చీఫ్.‌


అయితే ఇప్పుడు ఆయన మాటలు వివాదాస్పదం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే  భాగ్పుత్ నగరాన్ని పక్క వాళ్ళు లాక్కుపోతుంటే రష్యా సైన్యం ఏమి చేయలేకపోతున్నారు అంటూ రష్యా సైన్యాన్ని విమర్శిస్తున్నారు. ఎక్కడ అయితే ఆయన ప్రయోజనం పొంది ఇంత స్థాయికి వచ్చాడో ఇప్పుడు వాళ్ళనే విమర్శించడం అనేది వివాదాస్పదం అవుతున్నట్లుగా తెలుస్తుంది.


అసలు ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటే ఒక విషయం కనబడుతుందట. ఆయనకి రూలింగ్ చేసుకోవడానికి బాగ్ఫుత్ నగరాన్ని ఇవ్వకపోవడంతో ఉక్రెయిన్ వాళ్లనీ రెచ్చగొట్టి ఇలా చేస్తున్నాడా అని అంటున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ సైన్యంలోని కొంతమంది అధికారులు వ్యాగనార్ గ్రూపుకు చీఫ్ ని అమెరికా ఏజెంట్ అంటూ వ్యాఖ్యానించారట. వ్యాగనార్ గ్రూప్  చీఫ్ మాత్రం సోషల్ మీడియా ద్వారా అక్కడ సైనికులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు వ్యాగనార్ గ్రూపు చీఫ్ రష్యాకి ఒక శకునిలా మారాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: