జగన్‌ దెబ్బతో పూర్తిగా మారిపోయిన చంద్రబాబు?

Chakravarthi Kalyan
2014 లో ఎన్నికల మ్యానిఫెస్టో ద్వారా డ్వాక్రా రుణ మాఫీ, రైతు రుణ మాఫీ, సంపూర్ణంగా ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దీనిపై అప్పట్లో మ్యానిఫేస్టో గురించి జరిగిన సమావేశంలోనే విలేకరులు చంద్రబాబును అడిగిన ప్రశ్న... ఇప్పటికే రాష్ట్రం విడిపోయింది. ఏ విధంగా రుణ మాఫీ చేస్తారు. రుణ మాఫీ చేయాలంటే దాదాపు రూ. 80 వేల కోట్లు అవసరం అవి ఎక్కడి నుంచి  సేకరిస్తారు అని అడిగారు. దీనిపై చంద్రబాబు మాత్రం నా అనుభవం గురించి మీకు తెలియదా..  10 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను. 9 ఏళ్లు సీఎంగా కొనసాగాను. సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసూ అంటూ విలేకరుల ఎదుట డాంభీకాలకు పోయారు.

వైఎస్ జగన్ నుంచి లక్ష కోట్లు  కట్టిస్తాను అని అన్నారు. లక్ష కోట్లు అనే మాట ఉత్తదే అని ఆంధ్ర అసెంబ్లీలోనే తెలిసిపోయింది. కేవలం రూ. 1500 కోట్ల రూపాయలపైనే నాపైనే కేసులు ఉన్నాయని, అవి కూడా తెలంగాణలో ఉన్నాయి. ఆ 1500 కోట్లకు సంబంధించి కేసులు  ఏ విధంగా పెట్టారో జగన్ వివరించారు. చంద్రబాబు హామీ  ఇచ్చిన సంపూర్ణ రుణమాఫీ విడతల వారీగా చేస్తామని అన్నారు. కానీ అది సాధ్యపడలేదు. చివరకు డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ అమలు చేయలేదు. కేవలం పసుపు, కుంకుమతో సరిపెట్టారు.

ఎన్నికలకు వెళ్లే సమయం వచ్చింది. సంపద సృష్టిస్తాను.. జగన్ నుంచి డబ్బులు కట్టిస్తాను అనే డైలాగులు మళ్లీ చంద్రబాబు చెబుతున్నారు. ఈ విషయాలను ఏ విధంగా తీసుకోవాలో ప్రజలకు  అర్థం కావడం లేదు. ప్రజలు చంద్రబాబు మాటల్ని నమ్ముతారా? సంపద ఏ విధంగా సృష్టిస్తారు. ఎక్కడి నుంచి నిధులు సమకూరుస్తారు. అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి ప్రణాళికను అమలు చేస్తారు. కేంద్రంతో సయోధ్య కుదుర్చుకుంటారా? లేక మళ్లీ పంచాయితీ పెట్టుకుని రాష్ట్రానికి ఇబ్బందులు తెస్తారా అని జనం అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: