భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

Chakravarthi Kalyan
సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారుతున్నారు. సమాజానికి మంచి చేసే విషయంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు పాత్ర కీలకం. పాకిస్థాన్ కి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ షాన్ అలీ అనే వ్యక్తిని  యూట్యూబ్ లో ఎక్కువ మంది పాలో అవుతుంటారు. ఈయన్ని పిలిచి ఐఎస్ఐ మాట్లాడినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ లో ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి స్పందించమని కోరింది. మత విధ్వంసం, ఘర్షణ వాతావరణం అనే విషయాల నుంచి ప్రజల మైండ్ సెట్ ను పక్కకు తప్పించాలంటే భారత్ చేస్తున్న కుట్రగా అభివర్ణించాలని చెప్పింది.

గతంలో జకీర్ నాయక్ కూడా గతంలో చాలా మందిని మార్చగలిగారనే విమర్శలు ఉన్నాయి. పాకిస్థాన్ లో ఇప్పుడు యువత తీవ్రవాదం వైపు వెళ్లడానికి ముందుకు రావడం లేదు. గతంలో తీవ్ర వాద సంస్థల్లో చేరితే డబ్బులు అందేవి. దీంతో కుటుంబానికి ఇబ్బంది ఉండదని భావించే వారు.  దీంతో తీవ్రవాద శిక్షణలో లేదా ఏదైనా ఎటాకింగ్ లో పోతే ఆ యువకుడి కుటుంబానికి రూ. 5లక్షలు లేదా రూ. 10 లక్షలు ఇచ్చేవారు.

దీంతో ఆయా కుటుంబాలు కాస్త ఆనందంగా అయినా గడిపేవి..  పాకిస్థాన్ దగ్గర ఇప్పుడు  డబ్బులు  లేవు. తీవ్రవాదం వైపు కుర్రాళ్లను రప్పించడం  వారి వల్ల కావడం లేదు. గతంలో యువతకు డబ్బులు ఆశ చూపి శత్రుదేశం ఇండియా అని చెప్పించి వారికి ఉగ్రవాద శిక్షణ ఇప్పించి భారత్ అంటే ద్వేషం కలిగేలా చేసే వారు.  

ప్రస్తుతం యూట్యూబర్ షాన్ అలీ బయటపెట్టిన విషయం ద్వారా పాకిస్థాన్ వక్రబుద్ది మరో సారి బయట పడింది. ఎందుకంటే భారత్ పై అసహ్యం కలిగేలా వీడియోలు చేయాలని, పాక్ యువతను ఇన్‌ఫ్లుయెన్స్ చేసేలా మాట్లాడమని ఐఎస్ఐ చెప్పిందని అన్నారు. ఇలా ఐఎస్ఐ దారుణాలు చేస్తుంటే పాక్ ప్రభుత్వం ఏం చేస్తోందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే పాక్ ప్రభుత్వం ఏ మాత్రం సరైన నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపించడం లేదని తెలుస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: