భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో మరో సంచలనం.. నిందుతుడికి సాయం చేసిన ఇద్దరు మహిళలు?

frame భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో మరో సంచలనం.. నిందుతుడికి సాయం చేసిన ఇద్దరు మహిళలు?

MADDIBOINA AJAY KUMAR
హైదరాబాద్ లో మీర్ పేట్ లోని హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని గురు మూర్తి భార్యను చంపి కుకర్‌లో ఉడకపెట్టి పొడి చేసి చెరువులో పడేసిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో మరిన్ని కీలకమైన విషయాలు తెలిశాయి. భార్యని చంపడానికి ముందు వారిద్దరూ సినిమాకు వెళ్లి వచ్చారు అంట. ఆ తర్వాత ఊరు వెళ్లే విషయంలో గోడవపడి గురుమూర్తి మాధవిని చంపేశాడు.
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా గురుమూర్తియే భార్యని చంపినట్లు తెలిసింది. ఆ తర్వత సుమారు మూడు గంటల పాటు గురుమూర్తి ఇంట్లో క్లూస్ టీమ్ సోదాలు నిర్వహించింది. గురుమూర్తి ఇంట్లో ఇన్ఫ్రా రెడ్ చేయగా.. రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. దీంతో గురుమూర్తి ఇంట్లోని బాత్ రూమ్ లోనే మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలు నరికినట్లు స్పష్టం అయ్యింది. అయితే చంపిన తర్వాత రక్తపు మరకలు పోయేందుకు 10 సార్లు బాత్ రూమ్ ని కడిగినట్లు సమాచారం. శరీర అవయవాలు కాల్చిన ఆనవాళ్ళను పోలీసులు సేకరించారు. కాల్చిన ఆనవాళ్ళలో పోలీసులు dna సేకరించి.. దొరికిన dna తో పిల్లల dna తో టెస్ట్ చేయనున్నారు. అయితే గురుమూర్తి పిల్లలు పండగ తర్వాత ఇంటికి తిరిగిరగానే ఇల్లంతా వాసన వచ్చినట్లు తెలిపారు. అమ్మ ఎక్కడ నాన్న అని అడిగిన కూడా గురుమూర్తి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం పోలీసులు, గురుమూర్తి హత్య చేయడానికి ఉపయోగించిన పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక.. గురుమూర్తి మాత్రం తన భార్య మాధవిని చంపిన విధానంపై ఒక్కో సారి ఒక్కోలా పోలీసులకు చెప్తున్నాడు. అలాగే పొంతన లేని సమాధనాలతో కేసును తప్పు త్రోవ పట్టించేందుకు ప్రయతినిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసు మళ్లీ ఓ మలుపు తీరిగింది. మాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి మరో ముగ్గురు వ్యక్తులు సహాయం చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆ ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు అనుమనిస్తున్నారు. వారందరూ పరీరిలో ఉన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు గురుమూర్తిని విచారిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: