రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు.. ఆపి బ్యాగ్ చెక్ చేస్తే షాక్?

frame రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు.. ఆపి బ్యాగ్ చెక్ చేస్తే షాక్?

praveen
నేటి సభ్య సమాజంలో నేరాలు-ఘోరాలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. పోలీసులు ఎక్కడికి అక్కడ నిఘా ఏర్పాటు చేసి నేరస్తుల ఆటలు కడుతున్నప్పటికీ... ఎప్పటికప్పుడు కొత్త నేరస్తులు తెరమీదకి వస్తూనే ఉన్నారు. ఇక కొంతమంది అయితే ఏకంగా మనుషుల ప్రాణాలను తీసేందుకు కూడా వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దారుణంగా ప్రాణాలు తీసి శవాలను సైతం మాయం చేస్తున్న ఘటనలు ప్రతి ఒకరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వారి చేతిలో పెద్ద ట్రాలీ బ్యాగ్ ఉంది. ఈ క్రమంలోనే రైల్వేస్టేషన్లో అటు ఇటు నడుస్తున్న ఇద్దరు యువకులు ఒకరితో ఒకరు మాట్లాడటం లేదు  అంతే కాదు కాస్త అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారిని గమనించి..  ప్రశ్నించడం మొదలుపెట్టారు. కాగా సెక్యూరిటీ సిబ్బంది ఏం అడిగినా కూడా విచిత్రంగా సమాధానం చెప్పడంతో.. వారిపై ఇంకా అనుమానం పెరిగిపోయింది. అయితే ఏం అడిగినా కూడా మాట్లాడకుండా కేవలం సైగల ద్వారానే ఏదో చెప్పే ప్రయత్నం చేశారు  దీంతో  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారి బ్యాగులు వారి ప్రవర్తన పట్ల మరింత అనుమానం వ్యక్తం చేశారు.

 ఈ క్రమంలోనే ఈ అనుమానంతోనే ఆర్పిఎఫ్ సిబ్బంది వారి బ్యాగ్ ను తెరిచి చూడగా.. అందులో కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు  ఇక అక్కడికి వచ్చిన పోలీసులు సైతం ఒక్కసారిగా కంగుతున్నారు. మహారాష్ట్రలోని దాదర్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఏకంగా బ్యాగులో ఉన్న మృతదేహాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అధికారులు దర్యాప్తు చేయగా మృతదేహం అర్షద్ అలీ అనే వ్యక్తిది అనే విషయం తెలిసింది. ఇలా ట్రావెల్ బ్యాగ్ ని తీసుకు వెళ్తున్న వ్యక్తిని జై ప్రవీణ్ చావడ, అతని సహోదరుడు శివజిత్ సురేంద్ర సింగ్ గా గుర్తించారు. నిజంగానే వీరిద్దరూ వినలేరు మాట్లాడలేరు అన్న విషయం దర్యాప్తులో తేలింది. కాగా శివజిత్ సురేంద్ర సింగ్, మృతునికి మధ్య అతని స్నేహితురాలి విషయంలో గొడవ జరిగిందని.. ఈ గొడవే హత్యకు కారణమని దర్యాప్తులో తేల్చారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: