నిందితుడు ప్రణీత్ హనుమంత్ ఇంత నీచుడా? మరో కేసు నమోదు?

Purushottham Vinay

పసిపిల్లపై ఇంకా అతని తండ్రిపై నీచమైన బూతు కామెంట్స్ చేసిన నీచుడు ప్రణీత్ హనుమంత్ ను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తండ్రి, కూతురు బంధంపై అస్లీల కామెంట్స్ చేసి జైలుపాలు అయ్యాడు ప్రణీత్ హనుమంత్.సోషల్ మీడియాలో తండ్రి, కూతుర్ల రిలేషన్ పై తన స్నేహితులతో కలిసి అభ్యంతరకర కామెంట్స్ చేశాడు ప్రణీత్ హనుమంతు. వీడిపై ఇంకా వీడి స్నేహితులపై సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా  ఫైర్ అయ్యారు. వీడి పై పెద్దెత్తున విమర్శలు రావడంతో పోలీసులు బాధ్యత తెలుసుకొని పని చెయ్యడం మొదలు పెట్టారు. ఒళ్లోంచి రంగంలోకి దిగి వీడిని అరెస్ట్ చేశారు కానీ ఇంకా ముగ్గురు ఎదవలని మాత్రం పెట్టుకోకుండా గాలికి వదిలేశారు పోలీసులు. ప్రణీత్ హనుమంత్ కంటే ఘోరాతి ఘోరంగా ఆది అనేవాడు కామెంట్స్ చేశాడు. అసలు ముఖ్యంగా వాడిని అరెస్ట్ చెయ్యాల్సింది. వాడినే వదిలేశారు పోలీసులు. అయితే ఇదిలా ఉండగా తాజాగా ప్రణీత్‌ హనుమంత్‌పై మరో కేసు నమోదు అయ్యింది.ప్రణీత్‌ గంజాయి సేవించినట్టు మెడికల్‌ రిపోర్ట్ రావడంతో వీడిపై NDPS కింద కేసు పెట్టారు పోలీసూలు. ప్రణీత్‌ను మూడు రోజుల కస్టడీ డిమాండ్ చేస్తూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ప్రణీత్‌ న్యాయవాదికి నోటీసులు కూడా జారీ చేసింది కోర్టు. 


తండ్రి, కూతుర్ల బంధంపై యూట్యూబ్‌లో దారుణమైన కామెంట్స్‌ చేసిన ప్రణీత్‌ హనుమంత్‌..ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఊసలు లెక్కపెడుతూ ఉన్నాడు.డార్క్ కామెడీ పేరుతో ఒక చెత్త కంటెంట్ తో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ యూత్ ని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు వీడు ఇంకా వీడి బ్యాచ్. వీడి చేసిన నీచమైన పనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. హద్దు దాటానని.. క్షమాపణలుకోరుతూ ఓ వీడియోను కూడా వదిలాడు వీడు. గత కొన్ని రోజుల నుంచి తన తల్లిదండ్రులను చాలామంది బూతులు తిడుతున్నారని.. వారిని దయచేసి వారిని ఏమి అనొద్దని తప్పంతా తనదే అన్నాడు ప్రణీత్ హనుమంత్. ఈ విషయంలో చట్టానికి గౌరవిస్తూ ముందుకు సాగుతానని.. మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయనని వీడు చెప్పుకొచ్చాడు. తప్పు చేసి క్షమించమని అడిగినా వీడిపై జనాలు మండిపడుతూనే ఉన్నారంటే వీడెంత పరమ నీచుడో అర్ధం చేసుకోవచ్చు. ఇక వీడినే కాదు సోషల్ మీడియాలో ఇలాంటి పిచ్చి వాగుడు వాగేవారికి బుద్దొచ్చేలా శిక్షించాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు గంజాయి వ్యవహారం కూడా బయటకు రావడంతో కోర్టు వీడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: