మనుషులపై కుక్కల దాడులు.. కారణం అదేనా?

praveen
మనుషులకి కుక్కలకి మధ్య ఉన్న బంధం ఈ మధ్యకాలంలో ఎంతలా బలపడుతూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది జంతు ప్రేమికులు అయితే మనుషులనైనా అంత ప్రేమగా చూస్తారో లేదో కానీ.. ఏకంగా పెంపుడు కుక్కలను మాత్రం ఏకంగా మనుషుల కంటే ప్రేమగా చూసుకోవడం చేస్తూ ఉంటారు. పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నవారు. ఒక పూట ఉపవాసం ఉండడానికైనా ఇష్టపడతారేమో.. కానీ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కలకు మాత్రం ఎంతో ఖరీదైన ఆహారాన్ని తెచ్చి ఇవ్వడం కూడా నేటి రోజుల్లో జరుగుతూ ఉంది అని చెప్పాలి.

 ఇక విశ్వాసానికి మారుపేరుగా మనిషి కుక్కను నమ్ముతూ ఉంటాడు. ఎందుకంటే ఒక్కసారి కడుపునిండా అన్నం పెడితే చాలు ఆ కుక్క జీవితాంతం ఇక విశ్వాసంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన.. తర్వాత మనుషులకి కుక్కలకి మధ్య బంధం బలపడటం ఏమో.. కానీ వైరం మాత్రం అంతకంతకు పెరిగిపోతుంది అన్నది అర్థమవుతుంది. మనుషులను చూస్తే ఏకంగా పుట్టుకతోనే వైరం ఉందేమో అన్న విధంగా నేటి రోజుల్లో కుక్కలు ప్రవర్తిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా మనిషి కనిపిస్తే చాలు దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమవుతున్న ఘటనలు నేటి రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

 మరి ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను ఇలా కుక్కలు దాడి చేసి గాల్లో కలిపేస్తున్న ఘటనలు ఎన్నో కుటుంబాల విషాదాన్ని నింపుతూ ఉన్నాయి. అయితే ఇలా వీధి కుక్కలు మొన్నటి వరకు సౌమ్యంగా ఉండి ఇప్పుడు ఎందుకు మనుషులపై దాడి చేస్తున్నాయి అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఇలా మనుషులపై దాడులకు పాల్పడుతున్న కుక్కలు రక్తం మరిగాయి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రాజధాని పరిధిలో కొందరు చికెన్ మటన్ షాపుల నిర్వాహకులు మాంసపు వ్యర్థాలను కుక్కలకు వేయడంతో అవి నాన్ వెజ్ తినేందుకు బాగా అలవాటు పడుతున్నాయి. ఇలా మాంసానికి అలవాటు పడి చివరికి పిల్లలపై దాడి చేస్తున్నాయని కొంతమంది ఇంటర్నెట్ జనాలు అభిప్రాయపడుతున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి దీనిపై మీరేం అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: