భార్యతో సెక్స్ చేసినందుకు.. భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష?

praveen
ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల బంధాలు ఉన్నప్పటికీ భార్యాభర్తల బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వేరు వేరు ప్రపంచంలో వేరు వేరు పరిస్థితుల మధ్య పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే బంధంతో ఒక్కటై ఒకటిగా జీవించడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏకంగా ఒకరి కోసం ఒకరు వందేళ్ల పాటు బ్రతుకుతూ ఉంటారు  అందుకే ఇక మనిషి జీవితంలో వైవాహిక బంధం కంటే గొప్పది మరొకటి లేదు అని అంటూ ఉంటారు. అయితే భార్య భర్తల మధ్య శారీరక బంధం కూడా ఎప్పుడు బలంగా ఉన్నప్పుడే బంధం నిలబడుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు.

 అయితే ఇక్కడ మాత్రం భార్యతో శృంగారం చేశాడు అన్న కారణంతో ఏకంగా భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ వింత ఘటన మీరట్లో వెలుగులోకి వచ్చింది. అదేంటి భార్యతో శారీరక సంబంధం పెట్టుకుంటే భర్తకు శిక్ష విధించడం ఏంటి అని షాక్ అవుతున్నారు కదా.. 2015లో 13 ఏళ్ల మైనర్ బాలిక (ప్రస్తుతం ఆమెకు 22 ఏళ్లు) ఆమెపై అత్యాచారం చేసిన కేసులో 30 ఏళ్ల వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది  యువతి సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం అతని ప్రేమించింది  అతనితో పారిపోయి పెళ్లి చేసుకుంది. అప్పటికి ఆమెకు 18 ఏళ్లు నిండలేదు  పెళ్లయిన రెండు నెలల తర్వాత బాలిక తిరిగి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. అయితే తర్వాత  ఆమె భర్త ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేసింది బాలిక  ఈ జంటకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక మరో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు

 అయితే ఇక 13 ఏళ్ల సమయంలోనే ఆ బాలికకు పెళ్లి చేసుకుని.. ఆ బాలికతో అతను శారీరక సంబంధం కూడా పెట్టుకున్నారు   అయితే ఇదే విషయంపై కేసు నమోదు కాగా.. బరేలి ట్రయల్ కోర్టు ఏకంగా షాకింగ్ తీర్పునిచ్చింది. ఇలా మైనర్ ను పెళ్లి చేసుకుని ఆమెపై అత్యాచారం చేసినందుకు అతనికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఈ జంట సంతోషంగా ఉంటున్నారు  ఇలా అప్పుడు ఫిర్యాదు చేసిన యువతి ఇప్పుడు మూడోసారి గర్భవతి కావడం గమనార్హం. భర్తకు జైలు శిక్ష తప్పదు అని తీర్పు రావడంతో ఈ తీర్పుపై హైకోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో సదరు మహిళ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: