పసిపాపకు సిగరెట్, మద్యం తాగించిన తల్లీ.. చివరికి?

praveen
నేటి రోజుల్లో ప్రపంచం మొత్తం మత్తులో మునిగి తేలుతుందా అంటే అవును అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కేవలం మద్యం మాత్రమే కాదు సిగరెట్ తంబాకు గంజాయి డ్రగ్స్ ఇలా ఒక్కటేమిటి ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు. ఇలా ఏదో ఒక అలవాటుతో చివరికి మత్తులో మునిగిపోవడానికి మనిషి ఇష్టపడుతున్నాడు తప్ప.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే అయితే ఇలాంటి మత్తు పదార్థాల నుంచి పిల్లలను ఎప్పుడు దూరంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఏకంగా పిల్లలతో ఒకే గదిలో ఉన్నప్పుడు పొగ తాగకూడదు మద్యం సేవించరాదు అని సూచిస్తూ ఉంటారు నిపుణులు. కానీ ఇక్కడ మాత్రం ఓ తల్లి ఏకంగా అభం శుభం తెలియని చిన్నారి విషయంలో కర్కషంగా ప్రవర్తించింది. ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా బిడ్డను చూసుకోవాల్సిన తల్లి.. చివరికి కర్కశంగా ప్రవర్తించింది. ఏకంగా 20 నెలల పసికందుకు బలవంతంగా సిగరెట్ మద్యం తాగించింది. ఈ అమానవీయ ఘటన అస్సాంలో వెలుగు చూసింది. శించార్ కు చెందిన ఒక మహిళ ఏకంగా 20 నెలల పసుబిడ్డకు సిగరెట్ మద్యం తాగిపిస్తూ వేధింపులకు గురిచేసింది.

 దీంతో చిన్నారి గట్టిగా ఏడవడంతో ఏం జరిగిందో అని గమనించడానికి వెళ్లిన స్థానికులకు అక్కడ జరుగుతుంది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏకంగా ఇలా చిన్నారికి సిగరెట్ మద్యం తాగిస్తున్న తల్లిని అడ్డుకున్నారు. అయితే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులకు సమాచారం అందించారు.  ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు   మహిళ నివాసానికి చేరుకొని బిడ్డను రక్షించారు. మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం తల్లి బిడ్డ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కస్టడీలోనే ఉన్నారని సమగ్ర విచారణ జరిపిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: