
కుర్ కురే కొనివ్వలేదని.. భార్య విడాకులు?
ఏకంగా భార్య నచ్చిన కూర వండలేదని కొంతమంది.. భర్త తరచు తాగి వస్తున్నాడని ఇంకొంతమంది భర్త ఎక్కువ మంచివాడు అని ఇంకొంత మంది ఇలా చిత్ర విచిత్రమైన కారణాలతో ఎంతోమంది విడాకులు తీసుకొని వేరుపడటానికి ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఇలాంటి ఒక విచిత్రమైన కారణంతోనే ఏకంగా భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారు. విడాకులు అంటే ఏకంగా దాంపత్య బంధానికి స్వస్తి పలికి ఎవరి జీవితం వారు చూసుకోవడమే. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి అంటే ఏదో పెద్ద కారణమే కావాలి. కానీ ఇక్కడ విడాకులు తీసుకోవడానికి కారణం తెలిస్తే మాత్రం నోరేళ్లబెడతారు.
భార్యాభర్తల మధ్య కురుకురే విషయంలో ఏర్పడిన వివాదం చివరికి కోర్టు వరకు వెళ్ళింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది. ఐదు రూపాయల కుర్ కురే వల్ల వచ్చిన గొడవ విడాకుల వరకు వెళ్ళింది తనకు కుర్ కురే ప్యాకెట్ కొనివ్వలేదని భర్తతో గొడవ పడింది వివాహిత. చివరికి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమెకు కుర్కురే ప్యాకెట్ తింటే కానీ నిద్ర పట్టదట. ఇక భర్త కూడా భార్యను అర్థం చేసుకొని రోజు కుర్కురే ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చేవాడట. ఇటీవలే పని ఒత్తిడితోనో లేదంటే ఆదమరిచో ఇక కురుకురే ప్యాకెట్ తీసుకోలేదు. దీంతో సదరు మహిళా భర్తతో గొడవ పడింది. అతనిపై అలిగి ఇంటికి వెళ్ళిపోయింది. తన కోరికలు తీర్చని వ్యక్తితో ఉండే ప్రసక్తే లేదు అంటూ కోర్టు మెట్లు ఎక్కి విడాకులు ఇవ్వాలంటూ కోరింది. దీంతో కలగజేసుకున్న పోలీసులు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చచెప్పారు.