ఈ కాలంలో ఇలాంటి భార్యలు కూడా ఉన్నారా.. ఆమె ఏం చేసిందో తెలుసా?

praveen
భార్య అంటే ఎవరు భర్తలో సగం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే బంధం. ఇక కష్టసుఖాలలో సగం పాలుపంచుకునేది భార్య. ఒకరకంగా భర్తలో అర్థ భాగం అని చెప్పాలి. అయితే ఇవన్నీ సినిమా డైలాగులు. కానీ నిజానికి భార్య ఎవరు అంటే భర్తను రాచి రంపాన పెట్టి ఎప్పుడు గొడవ పడుతూ ప్రశాంతతను దూరం చేసేది అని నేటి రోజుల్లో చాలామంది భర్తలు చెబుతూ ఉంటారు. అయితే ఇలాంటివి అటు సోషల్ మీడియాలో కూడా జోక్స్ వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ఇంటర్నెట్ లో వచ్చే భార్యాభర్తల జోక్స్ తెగ పేలుతూ ఉంటాయి.

అయితే ఇలాంటి మాటలను బట్టి నేటి రోజుల్లో అసలు అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు లేనే లేరా అంటే.. అక్కడక్కడ కొంతమంది కనిపిస్తారు భర్త అంటే ప్రాణంగా.. భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేని విధంగా ఇక ప్రేమానురాగాలను కలిగి ఉంటారు ఎంతో మంది భార్యలు. కానీ కొంతమంది మాత్రం భర్తలు చెప్పినట్లుగానే ఎప్పుడు గొడవలు పడుతూ.. రాచి రంపన పెట్టడం లాంటివి చూస్తూ ఉంటాం. అయితే ఇలా నేటి రోజుల్లో భర్తలను ఇబ్బంది పెడుతున్న భార్యలు ఉన్న సమయంలో ఇక్కడ ఒక భార్యా మాత్రం ఏకంగా భర్త కోసం ఏ భార్య చేయని పని చేసింది. భర్తనే దేవుడిగా భావించి.. చనిపోయిన భర్తకు గుర్తుగా గుడి కట్టించింది భార్య. ఇది ఎక్కడో కాదు తెలంగాణలోనే జరిగింది.

 భర్తపై ప్రేమను ఒక మహిళ వినూత్నంగా చాటుకుని ఆయన జ్ఞాపకాలు పది కాలాలపాటు పదిలంగా ఉండేలా గుడి కట్టింది. మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి శివారు సోమ్ల తండాలో కళ్యాణి అనే మహిళ కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. అయితే భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది ఆమె. దీంతో భర్తే తనకు దేవుడు అని భావించి భర్తకు గుర్తుగా విగ్రహం చేయించి గుడికి నిర్మించింది.  ఇటీవల గుడిని ప్రారంభించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించింది. ఇలా భర్తకు భార్య గుడి కట్టించడం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: