పెద్దపులితో ఫోటో దిగాలనుకుంది.. కానీ చివరికి ఏం జరిగిందో చూడండి?

praveen
నేటి ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం జనాలు ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రమాదకరం అని తెలిసినప్పటికీ కొన్ని విన్యాసాలు చేయడం చేస్తూ ఉన్నారు. ఇలా చేసి కొంతమంది చివరికి ప్రమాదం బారిన పడుతూ ఉన్నారు. మరి కొంతమంది ఏకంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అని చెప్పాలి. అయితే ఇలాంటి తరహా ఫోటోలు వీడియోలు చాలానే ఇటీవల కాలంలో ఇంటర్నెట్లో వెలుగులోకి వస్తున్నాయి. ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలను చూసి ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

 కొంతమంది ప్రమాదం అంచున నిలబడి రీల్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటే.. ఇంకొంతమంది ప్రమాదకరమైన జంతువులతో ఆటలాడటం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గుర్తుకు వస్తూ ఉంటుంది. పులితో ఫోటో దిగాలనుకో తప్పులేదు. కానీ చనువు ఇచ్చింది కదా అని పులితో ఆటలాడుకోవాలి అనుకుంటే మాత్రం వేటాడేస్తది అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోకి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఒక మహిళ పులితో ఫోటో దిగడానికి ప్రయత్నించింది.

 దీంట్లో తప్పులేదు. కానీ ఏకంగా ఆ పులికి దగ్గరగా వెళ్లి అంటే దాని పక్కనే పడుకొని ఆ పులిపై  చేతులు వేసి నిమురుతూ ఫోటో దిగాలని అనుకుంది. కానీ ఆ పులికి కోపం వచ్చింది. దీంతో ఎంతో సీరియస్ గా పులి ఆమె వైపుకు తిప్పింది. ఏకంగా చేతిని కొరికేందుకు ప్రయత్నించింది. అయితే పక్కనే ఉన్న ఆ పులి శిక్షకుడు వచ్చి ఆ పులిని శాంతింప చేశాడు అని చెప్పాలి. ట్రైనర్ పక్కనే ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఇక ఆ మహిళ చివరికి పులికి ఆహారంగా మారిపోయేది అని ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: