కంటైనర్ లారీలో పాత ఫర్నిచర్.. కానీ అనుమానం వచ్చి చెక్ చేసి పోలీసులే షాక్?

praveen
ఇటీవల కాలంలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది అని చెప్పాలి. గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, అక్రమ బంగారం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి అన్నింటినీ కూడా అధికారుల కళ్ళు కప్పి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు కేటుగాళ్లు. అయితే పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ కేటుగాళ్ల ఆటలకు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఇలాంటి అక్రమాలకు పాల్పడేందుకు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు నేరస్తులు. ఇక ఇలాంటి తరహా ఘటనలు కొన్ని కొన్ని సార్లు పోలీసులకు షాక్ ఇస్తూ ఉన్నాయి అని చెప్పాలి..

 ఇకపోతే ఇటీవల ఇలాంటి అక్రమ రవాణాకి పాల్పడేందుకు ప్రయత్నించిన కేటుగాళ్లకు పోలీసులు షాక్ ఇచ్చారు.  రాజమహేంద్రి నుండి చెన్నైకు గుట్టుచప్పుడు కాకుండా ఎంతో సీక్రెట్ గా తరలిస్తున్న గంజాయి లోడ్ ను అడ్డుకున్నారు పోలీసులు. బాపట్ల శివారు సూర్యలంక కింద వంతెన వద్ద పైలట్ వాహనంతో పాటు వెళుతున్న కంటైనర్ లారీని బాపట్ల చీరాలలో సెబ్ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అయితే ఆ వాహనంలో డ్రైవర్ తీరు చూసి పోలీసులు మరింత అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కంటైనర్ ఓపెన్ చేసి చూపించమని అడిగారు.

 అయితే కంటైనర్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఉంది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు. ఎందుకంటే వాహనం లోపల పెద్ద మొత్తంలో గంజాయి బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి గుడిపాటి వేణుబాబుతో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు పాత ఫర్నిచర్ వెనుక గంజాయిని దాచిపెట్టారు అన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. దాదాపుగా 457 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  ఇక దీని విలువ దాదాపు 25 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇక వారిని విచారిస్తున్నారు. ఇక లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: