చిన్నప్పటినుంచి పెంచిన సింహమే.. చివరికి ప్రాణం తీసింది?

praveen
పాముకు పాలు పోసిన చివరికి పాలు పోసిన వాడినే కాటు వేస్తుంది అనే సామెత అందరికీ గుర్తుకు ఉండే ఉంటుంది. ఎందుకంటే కాటు వేయడం అనేది పాము నైజం. ఇక అక్కడ ఉన్నది పాలు పోసినవాడా లేకపోతే ఇంకొకరా అన్న విషయం గమనించరు. ఎవరు ఎదురుగా ఉంటే వారిని కాటు వేయడం చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక కేవలం పాము మాత్రమే కాదు అన్ని రకాల ప్రమాదకరమైన జంతువుల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పాలి. ఆ జంతువులను ఎంత ప్రేమగా పెంచుకున్న చివరికి పెంచుకున్న వారిని దారుణంగా చంపేసేందుకు కూడా కొన్ని క్రూర మృగాలు వెనకడుగు వెయ్యవు. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 ఎందుకంటే ఎంతో ప్రేమగా పెంచిన సింహమే చివరికి అతని ప్రాణం తీసేస్తుంది. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా జూలోకి సింహం పిల్లలను తెచ్చి వదిలేసినప్పుడు.. ఇక జూ కీపర్లే వాటి బాగోగులు చూసుకుంటూ ఉంటారు. ఇక చిన్నప్పటి నుంచి వాటి ఆరోగ్య పరిస్థితులు చూసుకోవడమే కాకుండా.. ఇక వాటికి ప్రతిరోజు కూడా ఆహారం అందించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక జూ కీపర్ ఏకంగా పసి కూనలుగా ఉన్నప్పటి నుంచి  సింహాలను సాకుతూ వచ్చాడు. కానీ చివరికి వాటి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

 ఈ ఘటన నైజీరియాలోని అలోవోలో యూనివర్సిటీలో వెలుగులోకి వచ్చింది. అక్కడ ఉన్న జూలో సింహాలను కూనలుగా ఉన్నప్పటి నుంచి సాకుతున్న జూ కీపర్ చివరకి వాటి చేతిలోనే కన్నుమూశాడు   ఎప్పటి లాగానే సింహాలకు ఆహారం అందించి తిరిగి వస్తున్న సమయంలో తలుపు వేయడం మరిచిపోయాడు. దీంతో వెనకాల నుంచి దూసుకు వచ్చిన ఒక సింహం అతనిపై దారుణంగా దాడి చేసి ప్రాణాలను తీసేసింది. అయితే సింహం దాడిలో తీవ్ర గాయాలపాయలైన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: