కష్టసుఖాల్లోనేనా.. చావులోనూ నీ వెంటే?

praveen
అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు మనిషి జీవితంలో ఎన్నో రకాల బంధాలు ఉంటాయి. కానీ అన్ని బంధాల కంటే మించినది. కడ వరకు తోడునీడగా ఉండేది మాత్రం కేవలం దాంపత్య బంధం మాత్రమే అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని బంధాలలోకెల్లా కేవలం వైవాహిక బంధమే గొప్పది అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి మూడుముళ్ల బంధంతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరికి ఒకరు తోడునీడగా ఉండాలి. కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని ఏ కష్టం వచ్చినా భర్తకు భార్య.. భార్యకు భర్త నేనున్నాను అనే భరోసాని ఇవ్వాలి.

 భార్యాభర్తల మధ్యలో ఇలాంటి ప్రేమానురాగాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇలా భార్యాభర్తల మధ్య పెద్దగా అన్యోన్యత కనిపించడం లేదు. కానీ ఒకప్పుడు భర్తే సర్వస్వంగా బ్రతికే భార్య ఇక భార్య కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే భర్త. ఇలాంటి ఇలాంటి బంధాలే ఎక్కువగా కనిపించేవి. అయితే ఇక్కడ ఇక అన్యోన్య దాంపత్యం అంటే ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తే సర్వస్వం బ్రతికిన భార్య భర్త మరణాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే మరణం లోను భర్తకు తోడుగానే ఉంటాను అనుకుంది సదరు మహిళ.

 చివరికి ఇక కష్టసుఖాల్లోనే కాదు మరణం లోను భర్త వెంటే వెళ్లిపోయింది. అనారోగ్యంతో భర్త  మరణించగా అతని మృతదేహం వద్దే భార్య కూడా ప్రాణాలు వదిలింది. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా తంటికొండ లో జరిగింది. కోసూరి సత్యనారాయణ అనే 77 ఏళ్ల వ్యక్తి ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి భర్తే సర్వస్వంగా బ్రతికిన భార్య భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. భర్త లేడు అన్న విషయం ఆమె గుండె ఆగిపోయేలా చేసింది. భర్తమృతదేహం పక్కన ఏడుస్తూనే చివరికి ప్రాణాలు వదిలింది భార్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: