ఓకే ఎన్ క్లోజర్ లోని సింహాలకు సీతా, అక్బర్ పేర్లు.. VHP ఏం చేసిందో తెలుసా?

praveen
సాధారణంగా జంతు ప్రదర్శనశాలల్లో ఇక అన్ని రకాల జంతువులను ఉంచుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలాంటి జంతువులను చూడటానికి ఎంతో మంది పర్యటకులు కూడా అక్కడికి వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా ఏకంగా జంతు ప్రదర్శనశాలలోని ఎన్క్లోజర్ లో ఉంచిన అన్ని రకాల జంతువులకు కూడా ఏదో ఒక పేరు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అక్కడి అధికారులు. ఇక వాటిని ఆ పేరుతోనే పిలవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఇక కొన్ని కొన్ని సార్లు ఇక జంతువులకి మనుషుల పేర్లను కూడా పెట్టడం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇలాగే జూలోని అధికారులు రెండు సింహాలకు పేర్లు పెట్టారు. కానీ ఈ పేర్లు పెట్టడం కాస్త వివాదాస్పదంగా మారిపోయింది. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఏకంగా హిందువులు ఈ విషయంపై కోర్టును ఆశ్రయించారు. వెంటనే ఎన్ క్లోజర్  లో పెట్టిన రెండు ఆడ మగ సింహాల పేర్లు మార్చాలి అంటూ కోర్టులో డిమాండ్ చేశారు ఎంతో మంది హిందువులు. అదేంటి సింహాలకు పేర్లు పెడితే హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయి అని అనుకుంటున్నారు కదా.

 అయితే ఓకే ఎన్ క్లోజర్ లో ఉన్న ఆడ సింహానికి సీత అని, మగ సింహానికి అక్బర్ అని పేరు పెట్టారు.. పశ్చిమ బెంగాల్ లోని ఒక జూలో ఇలా ఆడ మగ సింహాలకు ఇలా పేర్లు పెట్టారు అని చెప్పాలి. అయితే ఈ విషయంపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది  అటవీశాఖ అధికారులు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ విశ్వహిందూ పరిషత్ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. వెంటనే ఇక తాము ఎంతో పవిత్రంగా భావించే సీతాదేవి పేరును ఆ సింహానికి తొలగించి మరో పేరును పెట్టాలి అంటూ డిమాండ్ చేసింది విశ్వహిందూ పరిషత్. అయితే మరోవైపు ఆ సింహాలకు ఇంకా పేరును ఖరారు చేయలేదని అటు జంతు ప్రదర్శనశాల అధికారులు చెబుతూ ఉండడం గమనార్హం. ఈనెల 20వ తేదీన ఇక ఈ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: