ఎడ్ల బండిని కూడా వదల్లేదు.. చూసి పోలీసులే షాక్?

praveen
ఇటీవల కాలంలో అక్రమార్కుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ ఇక అక్రమార్కుల ఆటలకు అడ్డుకట్ట వేస్తూ ఉన్నారు. ఏకంగా గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం తరలించడం లాంటి వాటిని అడ్డుకొని సీజ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇక ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటూ ఉన్నారు అక్రమార్కులు. అయితే ఇటీవల కాలంలో మద్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కానీ బీహార్ రాష్ట్రంలో మాత్రం మద్యపానం పై నిషేధం కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా మధ్యపానం పై ఉన్న నిషేధాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎంతో మంది అక్రమార్కులు.. ఇక ఇతర రాష్ట్రాల నుంచి బీహార్ కు అక్రమంగా మద్యం తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికి అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఇక పోలీసులకు భారీగా మద్యం పట్టుబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో అక్రమార్కులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. గతంలో కార్లు బస్సులు ఆటోలు బైక్స్ వంటి వాహనాల్లో అక్రమంగా మద్యం తీసుకువెళ్లడం చూశాము.

 కానీ ఇప్పుడు పోలీసులకు దొరకకుండా ఏకంగా వినూత్నమైన రీతిలో మద్యం తరలించేందుకు ప్రయత్నించారూ అక్రమార్కులు. ఏకంగా ఎడ్ల బండిలో మద్యం తీసుకు వెళ్లడం సంచలనంగా మారిపోయింది. బీహార్ లోని గోపాల్గంజ్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఎడ్ల బండిలో అక్రమంగా రవాణా చేస్తున్న మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ఈ ఎద్దుల బండి నుంచి ఐదు లక్షల విలువైన ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులను చూసిన వెంటనే ఆ ఎద్దుల బండి పై ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. కాగా మద్యం నింపిన ఎద్దుల బండిని పోలీసులు స్టేషన్ కు తీసుకువచ్చి సీజ్ చేశారు. కాగా ఏకంగా ఆ ఎద్దుల బండిలో 963 లీటర్ల మద్యం  ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: