ఓ దేవుడా నీకు దయలేదా.. తెల్లవారితే పుట్టినరోజు.. కానీ అంతలోనే?

praveen
విధి ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మల్లాంటివి మాత్రమే అని అంటూ ఉంటారు పెద్దలు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేసిన వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరికి ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వరకు అంతా సంతోషంగా సాగిపోతూ ఉన్న ఎంతో మంది జీవితాల్లో ఊహించని ఘటనలు చివరికి ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా విధి కొన్ని కొన్ని సార్లు కక్ష కట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది. దీంతో ఊహించని రీతిలో ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ముద్దులు ఒలికించే మాటలు మాట్లాడే చిన్నారి ఏకంగా మృత్యువు ఒడిలోకి చేరింది.

 ఎంతో సంతోషంగా అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారి తిరిగి వస్తూ చివరికి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. తెల్లవారితే పుట్టినరోజు ఇక ఎంతో ఘనంగా వేడుకను జరుపుకోవాలి అని తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ అంతలోనే ఆ తల్లిదండ్రులను పుట్టెడు శోకంలో మునిగిపోయేలా చేసింది విధి. నారాయణపేట జిల్లా చిట్యాల గ్రామంలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్.ఎం.పి వైద్యుడు రమేష్, రక్షితలకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద అమ్మాయి నివేదిత (4)ను మరికల్లోని అమ్మమ్మ ఇంటికి కొద్ది రోజుల క్రితం పంపించారు తల్లిదండ్రులు.

 అయితే మనవరాలు ఇంటికి రావడంతో ఇక వెంకటయ్య దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. మనవరాలు ముద్దు ముద్దు మాటలను చూసి ఎంతగానో మురిసిపోయేవారు. అయితే ఇటీవల తిరుపతి ఏడుకొండల వారి దర్శనానికి తీసుకెళ్లి శనివారం మరికల్ చేరుకున్నారు. అయితే మనవరాలు పుట్టినరోజు కావడంతో వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఇంతలో చిన్నారి తల్లి ఫోన్ చేసి పుట్టినరోజు వేడుకలను చిట్టీయాలలో నిర్వహిస్తాం అంటూ తెలిపింది. దీంతో చిన్నారితో కలిసి ఇక చిట్యాలకు బయలుదేరారు. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని ఇక వెంకటయ్య బయలుదేరగా.. ఊహించని ఘటన జరిగింది. ఏకంగా బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. ఘటనలో నివేదిత అక్కడికక్కడే తుది శ్వాస విడిచింది. వెంకటయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే తెల్లవారితే పుట్టిన రోజు వేడుకలు ఉండగా అంతలోనే కూతురు దూరం కావడంతో కుటుంబ సభ్యులందరూ కూడా శోకంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: