ఆన్లైన్ గేమ్ ఆడాడు.. అలా జరిగిందని పురుగుల మందు తాగాడు.. చివరికి?

praveen
నేటి ఆధునిక యుగంలో అధునాతనమైన టెక్నాలజీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి టెక్నాలజీ మనిషి జీవన్ శైలిలో ఎన్నో మార్పులకు కూడా కారణమవుతుంది. ఇక ప్రతి పనిని కూడా సులభతరం చేసేస్తూ ఉంది అని చెప్పాలి. అయితే అంతా బాగానే ఉంది. కానీ ఎందుకో టెక్నాలజీ ద్వారా కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ టెక్నాలజీ కారణంగా అటు మనుషులకి శారీరక శ్రమ అనేది మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది.

 ఒకప్పుడు కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే చాలు దగ్గరలో ఉన్న మైదానంలోకి వెళ్లి తమకు నచ్చిన ఆటను ఆడుకునేవారు. చిన్నలు పెద్దలు అందరూ కూడా ఇదే చేసేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆటలు ఆడటం లేదా అంటే.. ఆడుతున్నారు. ఒకప్పటితో పోస్ట్ చూస్తే ఇంకా ఇప్పుడు కాస్త ఎక్కువగానే ఆటలు ఆడుతున్నారు. కానీ మైదానంలో కాదు అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ కాలం గడిపేస్తున్నారు. ఖాళీ సమయం దొరికినప్పుడు కాదు ఇక రోజంతా ఇక ఈ ఆన్లైన్ గేమ్స్ లోనే మునిగి తేలుతున్నారు ఎంతోమంది.

 ఈ క్రమంలోనే ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఆడుతూ బానిసగా మారిపోయి చివరికి పిచ్చి వాళ్ళలా మారిపోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. భారీగా డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఆన్లైన్ గేమ్స్  కారణంగా ఒక విద్యార్థి  ప్రాణం పోయింది. ఈ ఘటన తెలంగాణలోనే దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బహదూర్ పల్లిలో వెలుగులోకి వచ్చింది. నిఖిల్ అనే 20 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులకు తెలియకుండా రుణ యాప్ తో పాటు మిత్రుల వద్ద కొంత డబ్బులు అప్పు తీసుకున్నాడు.  ఆన్లైన్ గేమ్స్ ఆడి నష్టపోయాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: