స్నేహితుల మధ్య.. శారీరక సంబంధం చిచ్చు.. చివరికి?

praveen
అమ్మ, నాన్న, అక్క,  చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల బంధాలు ఉంటాయి. కానీ ఇలాంటి రక్త సంబంధాల కంటే గొప్పది స్నేహబంధం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే కుటుంబ సభ్యులతో చెప్పుకోలేని బాధలను కూడా స్నేహితులతో షేర్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక ఒక్కసారి స్నేహితున్ని కలిసాము అంటే చాలు ఇక మనసు నిండా ఉన్న భారం మొత్తం ఒక్కసారిగా తగ్గిపోతూ ఉంటుంది. ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా ఒకరికి ఒకరు ప్రాణంగా బ్రతికేస్తూ ఉంటారు స్నేహితులు.

 ఎందుకంటే ఇక ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల బంధాలు ఉన్నప్పటికీ అటు స్నేహ బంధాన్ని మించింది మాత్రం మరొకటి లేదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కష్టం వచ్చినా నష్టం వచ్చిన తప్పు చేసిన ఒప్పు చేసిన ప్రతి చోట మనకోసం స్నేహితుడు నిలబడతాయి. కానీ ఇటీవల కాలంలో స్నేహ బంధానికి కూడా మచ్చ తెచ్చే విధంగా  కొంతమంది  ప్రవర్తన తీరు ఉంది అని చెప్పాలి. ఏకంగా స్నేహితుడికి నమ్మకంగా ఉంటూ కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అంటూ భరోసా ఇవ్వాల్సిన దోస్త్ చివరికి.. అదే స్నేహితున్ని వెన్నుపోటు పొడవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు.

 ఇలాంటి తరహా ఘటనలు ఏకంగా స్నేహబంధం పై అందరిలో ఉన్న నమ్మకాన్ని పోయేలా చేస్తూ ఉన్నాయని చెప్పాలి. ఇక ఇటీవలే కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన ఘటన మరింత దారుణమైనది. శివమ్మోగ్గా జిల్లాకు చెందిన కిరణ్, అక్షయ్, హేమంత్, మరి స్వామి నలుగురు స్నేహితులు. వీరిలో కిరణ్ కు వివాహం జరిగింది. అయితే స్నేహితుడు అని పట్టించుకోకుండా కిరణ్ భార్యతో మరి స్వామి శారీరక బంధాన్ని పెట్టుకున్నాడు. ఏకంగా స్నేహితుడు కిరణ్ కళ్ళుగప్పి అతని భార్యతో పారిపోవాలని అనుకున్నాడు. ఇందుకోసం మరో స్నేహితుడు హేమంత్ సహాయం కూడా తీసుకున్నాడు. అయితే ఈ విషయం చివరికి కిరణ్ కు తెలిసింది. దీంతో హేమంత్ ను చంపేయాలి అనుకున్నాడు  దీనికి ఇక మరో స్నేహితుడైన అక్షయ్ సహాయం తీసుకొని దారుణంగా హత్య చేశాడు  చివరికి కిరణ్, అక్షయ్ ని పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: