స్కూల్లో సెలవు వస్తుందని.. హత్య చేసిన 8వ తరగతి విద్యార్థి?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కి పడుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే మనుషుల్లో మానవత్వం జాలి దయ అనే గుణం ఎక్కడ కనిపించడం లేదు. ఏకంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరిలో కూడా క్రూరత్వం అనేది రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. దీంతో సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తుంది. ఒక మనిషిని చంపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని.. చిప్పకూడు తినాల్సి వస్తుంది అని ఎవరు భయపడటం లేదు.

 ఏకంగా చాక్లెట్ తిన్నంత ఈజీగా మనిషి ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉన్నారు. ఇక కొన్ని కొన్ని ఘటనల్లో అయితే సొంతవారు ఇలా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఎప్పుడు ఎవరు ఎటువైపు నుంచి దాడి చేసి ప్రాణాలు తీస్తారో అనేది తెలియక అనుక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి నేటి సభ్య సమాజంలో నెలకొంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన హత్యకు సంబంధించిన ఘటన అయితే మరింత దారుణమైనది. ఏకంగా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి దారుణంగా హత్య చేశాడు. అది కూడా ఎందుకోసమో తెలుసా స్కూల్ కి సెలవు వస్తుంది అన్న కారణంతో.

 వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా. కానీ పశ్చిమ బెంగాల్లోనే పురిలియాలో ఈ ఘటన నిజంగానే వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు సెలవు వస్తుంది అనే ఆశతో ఎనిమిదో తరగతి విద్యార్థి ఒకటో తరగతి బాలుడుని దారుణంగా హత్య చేశాడు. జనవరి 30న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అదృశ్యమయ్యాడు. అయితే రెండు రోజుల తర్వాత చెరువులో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే తలపై గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెళ్లడైంది. ఈ క్రమంలోనే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే వారం కిందట హాస్టల్లో చేరిన ఎనిమిదో తరగతి విద్యార్థి ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే స్కూల్లో సెలవు కోసం ఏకంగా ఒకటో తరగతి బాలుడిని దారుణంగా చంపినట్లు విచారణలో తేలింది. ఇక ఈ విషయం తెలిసి పోలీసులు సైతం షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: