భార్య మంచి కోసం ఆలోచిస్తే.. భర్తను నిండా ముంచేసింది?

praveen
పెళ్లి అనే వైవాహిక బంధం లోకి అడుగు పెట్టిన తర్వాత అమ్మాయిల జీవితం పూర్తిగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎంత పెద్ద చదువులు చదివినా కూడా అన్ని పక్కన పెట్టేసి ఇక భర్త అత్తమామలకు సేవ చేస్తూ ఉండి పోవాల్సి ఉంటుంది. ఇంకొంతమందికి పైచదువులు చదువుకోవాలనే కల కలగానే మిగిలిపోతూ ఉంటుంది. అయితే పెద్ద పెద్ద చదువులు చదివిన భార్యలను ఇక వంటింటి కుందేళ్లుగా మార్చే భర్తలు కూడా నేటి రోజుల్లో చాలామంది కనిపిస్తున్నారు.

 అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులతో తాము ఎలాగో చదువుకోలేకపోయాము. ఇక భార్య పైచదువులు చదవాలని ఆశపడుతుంది. నేను ఎంత కష్టమైనా భరించి.. భార్యను చదివిస్తాను అని గొప్పగా ఆలోచించే భర్తలు కూడా నేటి సభ్య సమాజంలో లేకపోలేదు. ఎంతోమంది ఇక చెమటోడ్చి కష్టపడుతూ వచ్చిన.. డబ్బులతో గొప్ప గొప్ప చదువులు చదివేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే.. ఇలా చదివిస్తే భర్తలు మోసపోతారేమో అనే భావన ప్రతి ఒక్కరు కూడా కలుగుతుంది.

 ఎందుకంటే ఇటీవల కాలంలో ఇలాంటి దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తుంది. ఏకంగా భర్త నానా కష్టం చేసి భార్యను చదివిస్తే.. భార్య ఇక చదువుకున్న చోటే మరొకటి ప్రేమించి పెళ్లి చేసుకుని భర్తను నిండా ముంచేస్తుంది. ఇటీవల పంజాబ్ లోని బటాలా లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. పరేషా గ్రామంలో జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. హర్మింధర్ సింగ్  అనే వ్యక్తి భార్య మంచి భవిష్యత్తు కోసం ఉన్నత చదువులు చదివెందుకు కెనడాకి పంపించాడు. ఇక ఆమె చదువు కోసం ఆస్తులను కూడా అమ్మేశాడు. కానీ భార్య కెనడాలో తన స్నేహితున్ని ప్రేమించి పెళ్లి చేసుకుని.. భర్తను బెదిరించి మరి ఫోన్ నెంబర్లు బ్లాక్ లో పెట్టేసింది. దీంతో పోలీసులను ఆశ్రయించాడు భర్త.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: