జనాలు ఇలా తయారయ్యారేంటి.. టాయిలెట్ ని కూడా వదల్లేదు?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే ఇంటర్నెట్లో వాలిపోతూ ఉంది. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చే ఎన్నో ఆసక్తికర ఘటనలు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఘటనల ద్వారా నేటి సభ్య సమాజంలో మనుషుల తీరు ప్రతి ఒకరికి కూడా అర్థమవుతూ ఉంది.  కొన్ని కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే మనుషులు ఇంత నీచంగా మారిపోయారా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.

 ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద పెరిగిపోయింది. కాస్త అప్రమత్తంగా లేకపోయినా కూడా ఇక నిండా ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దొంగలు. అందిన కాడికి దోచుకుపోతున్నారు  ఒకప్పుడు కేవలం ఇళ్లల్లో మాత్రమే దొంగతనాలు చేసేవారు. కానీ ఇప్పుడు బస్సుల్లో ప్రయాణిస్తున్న ట్రైన్లలో జర్నీ చేస్తున్న.. ప్రతి చోట అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే ఇక దొంగలు బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుక పోవడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ దొంగలు మాత్రం ఏకంగా మనుషులను దోపిడీ చేయడం కాదు మరింత నీచంగా ఆలోచించారు. చివరికి టాయిలెట్ ని కూడా వదలలేదు.

 ఇప్పటికే రైల్వే నష్టాల్లో కొనసాగుతూ ఉంటే కొందరు కేటుగాళ్లు  చేస్తున్న పని రైల్వే శాఖకు మరింత నష్టాన్ని కలిగిస్తుంది. ఇటీవల ముంబై లోని చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్లో దొంగలు పడ్డారు. రైల్వే అధికారులు ఇటీవలే పునరుద్ధరించిన ఏసీ టాయిలెట్ బాత్రూంలలో అమర్చిన ట్యాప్ లు సీట్ కవర్లు బాటిల్ హోల్డర్లు లాంటివి ఏకంగా 70 వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. అయితే వీటి విలువ దాదాపు 12 లక్షల వరకు ఉంటుంది అని అటు రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ఇలా చివరికి టాయిలెట్ ని కూడా వదలకుండా వస్తువులను చోరీ చేయడం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: