కుక్క వల్ల భార్య మృతి.. నేనే కారణం అంటున్న భర్త?

praveen
ఇటీవల కాలంలో మనుషులకి కుక్కలకి మధ్య బంధం మరింత బలపడుతుంది అని ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతో మంది తమకు నచ్చిన బ్రీడ్ కుక్కను తెచ్చుకొని ఇంట్లో మనుషుల్లాగా పెంచుకోవడం చూస్తూ ఉన్నాం. ఏకంగా మనుషులైనా ఒక పూట పస్తులు ఉంటున్నారేమో కానీ కుక్కలకు మాత్రం భారీగా ఖర్చు చేసి మరి మంచి ఆహారాన్ని పెడుతూ ఉన్నారు. ఇలా మనుషులు కుక్కలను తమతో సమానంగానే చూస్తూ ఉన్నారు. కానీ ఇక వీధి కుక్కలు మాత్రం ఏకంగా మనుషుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఏకంగా మంచి బ్రీడ్ ఉన్న కుక్కలను తెచ్చుకుని పెంచుకుంటూ తమను పట్టించుకోవడం లేదు అని కోపంతో ఉన్నాయో.. లేదంటే పుట్టుకతోనే మనుషులపై వైరంతో పుట్టాయో తెలీదు. కానీ మనుషులను చూస్తే చాలు శత్రువులను చూసినట్లుగా దారుణంగా దాడి చేస్తున్నాయి. చివరికి తీవ్రంగా గాయపరచి ఎంతో మంది ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి. అయితే కేవలం దాడి చేయడం వల్ల మాత్రమే కాదు రహదారులపై వాహనాలకు అడ్డురావడం ద్వారా కూడా ఎన్నో రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతూ ఉన్నాయి కుక్కలు. ఇలా కుక్కలు అడ్డు వచ్చి రోడ్డు ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారు సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్ లోని నర్మదా జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు తన భార్యతో కలిసి కారులో వెళ్తున్నాడు. ఇంతలో వారికి ఒక కుక్క అడ్డు వచ్చింది. అయితే ఆ కుక్కను తప్పించే ప్రయత్నంలో చివరికి వారి కారు భారీకేట్లను ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే తన నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని తనపై కేసు నమోదు చేయాలి అంటూ పోలీసులను ఆశ్రయించాడు భర్త. అయితే భర్త విజ్ఞప్తితో షాక్ అయిన పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: