పెళ్లి ఫిక్స్ అయిందని సంతోషంలో డాన్స్ చేశాడు.. కానీ చివరికి?

praveen
ప్రతి ఒక్కరి జీవితం లో పెళ్లి అనేది ఒక ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఒంటరిగా సాగిపోతున్న ఏకాకి జీవితానికి ఒక తోడు నీడను ఇస్తూ ఉంటుంది పెళ్లి అనే బంధం. ఈ క్రమం లోనే ఇక జీవితాంతం కష్ట సుఖాల్లో పాలుపంచుకునే ఒక భాగస్వామిని వైవాహిక బంధం అందిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పెళ్లి అనేది చేసుకుంటేనే వారి జీవితం సార్థకం అవుతుంది అని ఒకప్పుడు పెద్దలు కూడా చెబుతూ ఉండేవారు. పెళ్లి విషయం లో యువతీ యువకులు ఇద్దరికీ కూడా భారీగానే ఆశలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

తమకు నచ్చిన భాగస్వామి లైఫ్ లోకి వస్తుందని.. ఇక తమ మనసును అర్థం చేసుకొని సంతోషంగా చూసుకుంటుందని యువకులు అనుకుంటే.. ఇక పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే భర్త వస్తాడని అటు అమ్మాయిలు కూడా ఆశ పడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక యువకుడు కూడా పెళ్లి విషయం లో ఇలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. చివరికి పెళ్లి కుదిరింది. ఇక పెళ్లి ముహూర్తం రాని వచ్చింది. ఈ క్రమం లోనే  ఇటీవల బ్యాచిలర్స్ పార్టీని ఏర్పాటు చేశాడు వరుడు. కానీ అదే అతనికి చివరి రోజు అవుతుందని మాత్రం ఊహించ లేకపోయాడు.

 మరికొన్ని రోజుల్లో ఆనందోత్సాహాల మధ్య వివాహం చేసుకోవాల్సిన వరుడు చివరికి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఉత్తరప్రదేశ్లో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. నోయిడాలో 22 ఏళ్ల యువకుడు అమిన్ తనకు పెళ్లి కుదిరింది అన్న ఆనందంతో బంధువులతో కలిసి పార్టీ ఏర్పాటు చేశాడు. ఇక అందరితో కలిసి సరదాగా డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: