అక్రమ సంబంధం ఉందని భార్యపై అనుమానం.. భర్త ఏం చేశాడంటే?

praveen
ఏ బంధంలో అయినా నమ్మకం అనేది పునాది లాంటిది. పునాది బలంగా ఉన్నప్పుడే ఇల్లు నిలబడుతుంది. అలాగే ఇక ప్రతి బందంలో నమ్మకం ఉన్నప్పుడే ఆ బంధం నిలబడుతుంది అని చెప్పాలి. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధం లో ఇలాంటి నమ్మకం ఎంతో ముఖ్యం. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే దాంపత్య జీవితం సాగిపోతూ ఉంటుంది. కానీ ఈ బంధంలో అనుమానం అనే పెనుభూతం దూరింది అంటే చాలు ఎంతో సంతోషాన్ని ఇచ్చే దాంపత్య బంధం కూడా నరకప్రాయంగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 ఏకంగా అనుమానంతో కట్టుకున్న వారిని సైతం దారుణంగా హత్య చేసే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా ఏకంగా కట్టుకున్న వారు తమను మోసం చేసి ఇతరులతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు అని అనుమానంతో ఇక ఎంతో మంది దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. హ్యాపీగా సాగిపోతున్న సంసారంలో అనుమానం అనే పెనుభూతం దూరింది. దీంతో మరో వ్యక్తితో వివాహక సంబంధం పెట్టుకుంది అనే భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు భర్త.

 ఈ అనుమానం ఏకంగా అతనిని రాక్షసుడిలా మార్చేసింది. ఏకంగా తన భార్యను కలపను చెక్కే ఉలితో దారుణంగా కోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని మురారి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సత్య విహారి ఏరియాలో 46 మహిళ రక్తపు మడుగులో పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక ఆమె భర్తను అదుపులో తెలుసుకొని విచారించగా ఆ భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. అయితే నిందితుడునీ అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: