మూడో భార్య కూడా అలా చేస్తుందేమో అని.. 12 ఏళ్లుగా బంధించిన భర్త.. చివరికి?

praveen
భార్య అంటే కేవలం బానిస మాత్రమే అనుకునేవారు ఒకప్పుడు. దీంతో కేవలం వంటింటికి మాత్రమే పరిమితం చేసేవారు. కానీ నేటి రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మహిళలు పురుషులతో సమానంగా అని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో మహిళలు కేవలం వంటింటి కుందేళ్లు మాత్రమే అనే భావన ఎవరిలో కూడా కనిపించడం లేదు. కానీ ఇప్పటికీ కూడా భార్యలను బానిసగా చూసే భర్తలు అక్కడక్కడ ఉన్నారు అన్న విషయం వెలుగులోకి వచ్చే ఘటనలను చూస్తే ఉంటే అర్థమవుతోంది.

 ఎందుకంటే కట్టుకున్న భార్య కాళ్ళ కింద చెప్పులా ఉండాలని ఏకంగా బానిసలా సేవలు చేయాలి అనుకునే భర్తలు ఉన్నారు. ఏకంగా భార్యల విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. అతనికి పెళ్లయింది. పెళ్లి అవ్వడం అంటే ఒక్కసారి కాదు ఏకంగా రెండుసార్లు అయింది. అయితే అతని వేధింపులు తట్టుకోలేకనో లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందో తెలియదు కానీ చివరికి ఇద్దరు భార్యలు కూడా అతని వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఇక మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు.

 అయితే ఇక మూడో భార్య కూడా తనను వదిలి వెళ్ళిపోతుందేమో అని భయం అతనికి పట్టుకుంది. దీంతో చివరికి మూడో భార్యను చిత్రహింసలకు గురిచేసాడు. దాదాపు 12 ఏళ్లుగా ఇంట్లోనే నిర్బంధించాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బానిసగా బ్రతికేలా చేశాడు. కర్ణాటకలో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అయితే అతని నుంచి ఎలాగోల తప్పించుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త తనను 12 ఏళ్లుగా ఇంట్లో నిర్బంధించాడు అంటూ పోలీసులకు తెలిపింది. కొన్ని నెలలగా భర్త చిత్రహింసలకు గురిచేసాడని వాపోయింది. మరుగుదొడ్డి అవసరాలకు చిన్న చిన్న డబ్బాలను ఉపయోగించుకున్నట్లు తెలిపింది. అయితే భర్తపై కేసు పెట్టేందుకు ఆమె నిరాకరించింది. ఇక మూడో భార్య కూడా వదిలి వెళ్తుందేమో అనే అభద్రతా భావనతోనే అతను ఇలా చేశాడని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: