అలా చేశాడని.. అందరి ముందే డాక్టర్ ను చెప్పుతో కొట్టిన మహిళ?

praveen
సాధారణంగా వైద్యులను ప్రత్యక్ష దైవం అని అంటూ ఉంటారు. ఎందుకంటే గుడిలోకి వెళ్లి కోరికలు కోరుకుంటే ఆ దేవుడు నెరవేరుస్తాడో లేదో తెలియదు. కానీ ఆరోగ్య సమస్య ఉంది ప్రాణాలను కాపాడండి అని ఆసుపత్రికి వెళ్తే వైద్యులు  మాత్రం తప్పకుండా ప్రాణాలను నిలబెడతారు అని ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు. అయితే కరోనా వైరస్ తర్వాత వైద్యులపై ఉన్న గౌరవం ప్రతి ఒక్కరిలో కూడా పెరిగిపోయింది. ఎందుకంటే అందరూ కనిపించని శత్రువుకు భయపడి ఇంటిపట్టునే ఉంటే వైద్యులు మాత్రం కుటుంబ బాధ్యతలను సైతం వదిలేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు.

 అయితే ఇక ఎంతోమంది డాక్టర్లు ఇలా చికిత్స చేసీ ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొంతమంది మాత్రం ఏకంగా వైద్యవృత్తికే కళంకం పిలిచే విధంగా నీచమైన పనులు చేస్తూ ఉంటారు. ఏకంగా పేషంట్లతో అమర్యాదగా ప్రవర్తించడం చేస్తుంటారు. అచ్చం ఇలాంటి తరహా ఘటన ఒడిశాలో వెలుగులోకి వచ్చింది. పర్ల కిమిడి జిల్లాలోని ఆసుపత్రిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న సౌదామిని రైతా అనే బాలిక ఇటీవల హాస్టల్ క్యాంపస్ లో ఉరివేసుకుంది. బాలిక మరణం పై ఎన్నో అనుమానాలు తిరమీదికి వచ్చాయి.

 పాఠశాల యాజమాన్యం ఆత్మహత్య చేసుకుంది అని వాదన వినిపిస్తే.. కుటుంబ సభ్యులు మాత్రం ఎవరో పథకం ప్రకారం హత్య చేశారు అంటూ ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చివరికి ఈ కేసు క్రైమ్ బ్రాంచ్ కి వెళ్ళింది. మరణించిన బాలిక తల్లి సుగ్యాన్ని ఏకంగా కూతురికి పోస్టుమార్టం చేసిన డాక్టర్ పై దాడి చేశారు. ఎందుకంటే పోస్టుమార్టం రిపోర్టులో బాలిక శరీరంపై కనిపించిన గాయం గుర్తులను డాక్టర్ ప్రస్తావించలేదు. కావాలని తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది. ఏకంగా డాక్టర్ నీ అందరి ముందు చూస్తుండగానే మృతురాలి తల్లి డాక్టర్ ను చెప్పుతో కొట్టి దూషించింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి చేస్తున్న ఆరోపణలపై విచారణ చేస్తామని వైద్యాధికారి ప్రదీప్ పాండా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: