అయ్యో దేవుడా.. కుక్కలు ప్రాణం తీసాయి?

praveen
వీధి కుక్కలను గ్రామ సింహం అని అంటూ ఉంటారు. ఎందుకంటే గ్రామంలోని జనాలు అందరూ కూడా నిద్రపోయిన సమయంలో గ్రామ సింహాలు  వీధి వీధి తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక మనుషులతో ఎంతో విశ్వాసంగా మెలుగుతూ ఉంటాయి కుక్కలు. ఒక్కసారి కడుపునిండా అన్నం పెట్టాము అంటే చాలు ఇక జీవితాంతం ఆ విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అందుకే కుక్కలను విశ్వసానికి మారుపేరుగా పిలుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఘటన చూస్తుంటే ఏకంగా కుక్కలు గ్రామ సింహాలు కాదు.. అడవుల్లో ఉండే క్రూరముగాల కంటే దారుణం అనే భావన ప్రతి ఒక్కరు కూడా కలుగుతుంది.

 ఎందుకంటే ఏకంగా మనుషులకి కుక్కలకి మధ్య పుట్టుకతోనే జాతి వైరం ఉందేమో అన్న విధంగా నేటి రోజుల్లో వీధి కుక్కలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఏకంగా మనుషులు కనిపించారు అంటే చాలు దారుణంగా దాడి చేస్తూ గాయపరుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఇలా వీధి కుక్కల దాడిలో ఎంతోమంది అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.

 అభం శుభం తెలియని ఏడాది చిన్నారి ఉసురు తీసాయి వీధి కుక్కలు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగింది వీధి కుక్కల దాడిలో ఏడాది చిన్నారి నాగరాజు మరణించాడు. సామా ఎన్ క్లయివ్ సమీపంలోని గుడిసెలో ఉన్న చిన్నారిపై కుక్కలు దారుణంగా దాడి చేసి చంపేశాయ్. అయితే తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఇక ఇంట్లోకి వెళ్లిన వీధి కుక్కలు చిన్నారిపై దారుణంగా దాడి చేసాయ్. అయితే స్థానికులు అప్రమత్తం అయ్యేలోపు  తీవ్రంగా గాయపరిచాయి. చివరికి గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: