ఇంస్టాగ్రామ్ లో పరాయి వ్యక్తితో భార్య చాటింగ్.. చివరికి?

praveen
సోషల్ మీడియా ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాకిపోయింది. ప్రపంచ నలమూలల్లో జరిగిన ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా ఇట్టే తెలిసేలా చేస్తూ వుంది. ఈ క్రమంలోనే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ప్రతి మనిషి ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నాడు అని చెప్పాలి. ఇక ఎన్నో కొత్త విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా నేర్చుకోగలుగుతున్నాడు. దీంతో సోషల్ మీడియాతో చాలా ప్రయోజనాలు ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయ్.

 ఎందుకంటే నేటి రోజుల్లో సోషల్ మీడియాకు బానిసగా మారిపోతున్న మనుషులు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఏకంగా ఇలాంటి సోషల్ మీడియానే ఎంతోమంది కాపురాల్లో చిచ్చు పెడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ముక్కు ముఖం తెలియని వారి మాయలో పడిపోతూ సోషల్ మీడియాలో చాటింగ్లు వీడియో కాల్స్ అంటూ కొంతమంది రెచ్చిపోతూ ఉండడంతో చివరికి పచ్చటి కాపురంలో చేతలారా చిచ్చు పెట్టుకుంటున్నారు. అయితే భార్యాభర్తల మధ్య ఇలాంటి విషయంపై జరిగే గొడవలు కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతున్నాయి.

 అయితే ఇటీవల హైదరాబాద్ నగరంలోని కాప్రా మండలం జవహర్ నగర్ పిఎస్ పరిధిలో కూడా ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జవహర్ నగర్ కు చెందిన వివాహిత ముగ్గురు పిల్లలు భర్తతో కలిసి ఉంటుంది. అయితే ఆమె ఇంస్టాగ్రామ్ వాడటానికి బాగా అలవాటు పడిపోయింది. ఈ క్రమంలోనే ఇక సోషల్ మీడియాలో ఒక వ్యక్తితో సంభాషించడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని భర్త గుర్తించాడు. ఈ క్రమంలోనే ఈ విషయంపై ప్రశ్నించగా ఈనెల 28వ తేదీన భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. కాగా ఇటీవల భర్త విధులకు వెళ్ళగా.. ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఎంత వెతికిన దొరకకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: