అయోధ్యలో కొత్త దోపిడీ.. తస్మాత్ జాగ్రత్త?

praveen
దశాబ్దాల హిందువుల కల నెరవేరింది. రామ జన్మభూమిగా పిలుచుకునే అయోధ్యలో ఇటీవలే రామ మందిర నిర్మాణం జరిగింది. అయితే ఇక ఈ ప్రారంభోత్సవం ఎంత అట్టహాసంగా  జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ప్రస్తుతం సాధారణ భక్తులు కూడా అయోధ్యలోని రామ మందిర దర్శనానికి భారీగా తరలివస్తూ ఉన్నారు  ఈ క్రమంలోనే ఆలయ అధికారులు ఇలా భారీగా పోటెత్తుతున్న భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం భారీగా భక్తులు అయోధ్యకు వస్తున్న తరుణంలో ఇదే అదునుగా భావిస్తున్న అక్కడి రెస్టారెంట్లు రేట్లు భారీగా పెంచేసాయి.

 ఒకరకంగా చెప్పాలి అంటే అయోధ్యలో రాముడి దర్శనానికి వెళ్లిన భక్తులను రెస్టారెంట్లు నిలువు దోపిడీకి పాల్పడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే ఒక రెస్టారెంట్ చేసినా నిర్వాకం వెలుగులోకి రాగా.. ఈ విషయం గురించి తెలుసు ప్రతి ఒక్కరు కూడా నోరెళ్ళ పెడుతున్నారు. ఆ రెస్టారెంట్ పేరు శబరి రసూయి. ప్రాణప్రతిష్ట కార్యక్రమం తర్వాత ఈ రెస్టారెంట్ ని కొత్తగా ప్రారంభించారు. రామాలయాన్ని దర్శించుకోవడం కోసం భక్తులు భారీ స్థాయిలో తరలివస్తుండగా వీరి బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. అయితే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉండడంతో.. ఈ రెస్టారెంట్ యాజమాన్యం కాస్త కక్కుర్తి పడి ధరలను  అమాంతం పెంచేసింది.

 ఏకంగా 10 రూపాయలకు అవ్వాల్సిన టీ  ఏకంగా 55 రూపాయలకు పెంచేసింది. అలాగే ఒక్కో టోస్ట్ ధరను 65 రూపాయలుగా పెంచేశారు. ఇక ఇటీవల ఇద్దరు కస్టమర్లు అక్కడికి వెళ్లి రెండు టీలు రెండు టోస్టులు ఆర్డర్ చేయగా జీఎస్టీ తో కలిపి 252 రూపాయలు వసూలు చేసింది రెస్టారెంట్ యాజమాన్యం. దీంతో కంగుతిన్న కస్టమర్ ఇదేంటి అని రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించాడు. ఇక వాళ్ల దగ్గర నుంచి సరైన సమాధానం లేకపోవడంతో సోషల్ మీడియాలో ఈ బిల్లును షేర్ చేశాడు. అయోధ్యలో రాముడి పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయంపై అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ స్పందించింది. ఏకంగా సదరు హోటల్ కి షోకాస్ నోటీసులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: