భార్యే ప్రాణంగా బతికిన భర్త.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా?

praveen
భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఇక వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత.. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలి. అయితే ఇలా ఉంటారు కాబట్టే ఇక ప్రతి మనిషి జీవితంలో అన్ని బంధాల కంటే భార్యాభర్తలు బంధం ఎంతో గొప్పది అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఇలాంటి అన్యోన్యత భార్యాభర్తల మధ్య పూర్తిగా కరువైపోయింది. చిన్న చిన్న కారణాలతోనే చివరికి విడిపోవడానికి కూడా సిద్ధమవుతున్న వారు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు.

 ఇంకొంతమంది కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా.. పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి.. చివరికి కష్టసుఖాల్లో తోడు ఉంటాము అని ప్రమాణం చేసి మరి కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇలా అక్రమ సంబంధాల నేపథ్యం లో  జరుగుతున్న ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చి అందరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి  అయినప్పటికీ జనాలు తీరులో మాత్రం అస్సలు మార్పు రావడం లేదు అని చెప్పాలి. ఇటీవల సిద్దిపేట జిల్లాలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది.

 ములుగు మండలం బైలాంపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో గువ్వ నరేష్ అనే 30 ఏళ్ల వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని గజ్వేల్ ఏసిపి రమేష్ తెలిపారు. అయితే నరేష్ భార్య లతకు చిన్న తిమ్మాపూర్ వాసి అయిన జోగు భువనేష్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే తమ సుఖానికి అడ్డు వస్తున్నాడు అన్న కారణంతో భర్త నరేష్ ను చంపాలని అనుకుంది భార్య లత. అయితే ఇటీవల నరేష్ మద్యం తాగి నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు భువనేశ్వర్ తో కలిసి గొంతు నులిమి హత్య చేసింది. చీరను మెడకు కట్టి ఇంట్లో వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు నిజం ఒప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: