చిన్న ముల్లు గుచ్చుకుంది అని లైట్ తీసుకుంది.. కాని చివరకి 55 ఆపరేషన్లు?

praveen
కాలం కలిసి రాకపోతే చిన్న తాడు కూడా తాచుపాముల మారి కాటు వేస్తుంది అనే ఒక సామెత ఉంది. అయితే ఈ సామెత ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మహిళ విషయంలో నిజంగా నిజం అయింది అని చెప్పాలి. ఆమె నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఆమె కాలుకి ఫిషింగ్ హుక్ గుచ్చుకుంది. అయితే ఏదో చిన్న ముళ్ళు గుచ్చుకొని ఉంటుందిలే అనుకొని ఆమె లైట్ తీసుకుంది. పెద్దగా ఆ విషయం గురించి పట్టించుకోలేదు. అయితే చూస్తూ చూస్తుండగానే ఆమె చిన్న ముళ్ళు అనుకున్నది కాస్త చివరికి 55 ఆపరేషన్లు చేయించుకునే పరిస్థితికి కారణమైంది.

 ఏకంగా ఐదేళ్లలో 55 ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది సదరు మహిళ. ఈ క్రమంలోనే ఆమె కాలిలో కొంత భాగం తొలగించడంతో ఆ ప్రాంతంలో చిన్న గొయ్యి లాంటిది ఏర్పడింది. ఈ ఘటన ఇంగ్లాండ్లో వెలుగులోకి వచ్చింది. మిషన్ మిల్టన్ అనే మహిళ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఆమెకు 36 ఏళ్ళు. 2019లో ఆమె తన సోదరులతో కలిసి ఫిషింగ్ ట్రిప్ పై వెళ్ళింది. ఆ సమయంలో ఆమెకు ఫిషింగ్ హుక్ కాల్ లోకి దిగింది. ఏదో ముళ్ళు గుచ్చుకొని ఉంటుంది. గాయం చిన్నదే కావడంతో ఆమె పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత నాలుగు రోజులకి కాలు మొత్తం వాచిపోయింది. తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఫిషింగ్ హుక్ గుచ్చుకోవడంతో ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు తెలిపారు.

 దీంతో ఆపరేషన్ చేసి ఇన్ఫెక్షన్ తొలగించగా.. ఆమె కాలికి పెద్ద గొయ్యి లాగా ఏర్పడింది. ఆ తర్వాత ఎన్నో రకాల ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఇప్పటికీ ఆమె నొప్పితో నరకాన్ని అనుభవిస్తుందట. ఇన్ని ఆపరేషన్లు వద్దు కాలుని తొలగించమని వైద్యులను వేడుకుందట. డాక్టర్లు మాత్రం అలా చేయడం కుదరదు అని చెప్పారట. అసలేం జరిగిందో నాకు అర్థం కాలేదు. అర్థం అయ్యేలోపు మొత్తం ప్రమాదం జరిగిపోయింది. కాలు మొత్తం వాచిపోయింది. ఇక ఇన్ఫెక్షన్ రోజు రోజుకి కాలు అంతా వ్యాపించింది అంటూ సదన మహిళల చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: