క్రికెట్ ఆడితే ప్రాణం పోతుందా.. ఆర్మీ జవాన్ మృతి?

praveen
మొన్నటి వరకు కరోనా వైరస్ ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో భయపెట్టేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా కరోనా వైరస్ ను మించి మరో విషయం అందరిలో ప్రాణ భయాన్ని కలిగిస్తుంది అదే గుండెపోటు. ఒకప్పుడు గుండెపోటు అనగానే కేవలం వయసు పైబడిన వారికి మాత్రమే వస్తుంది అనుకునేవారు. ఒకవేళ గుండెపోటు వచ్చిన రెండు లేదా మూడుసార్లు తీవ్రమైన గుండెపోటు వస్తేనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అని నమ్మేవారు. కానీ నేటి రోజుల్లో వయస్సు పైబడిన వారికి కాదు ఏకంగా అభం శుభం తెలియని చిన్నారులు సైతం గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 అప్పుడు వరకు ఎంతో సంతోషంగా గడిపిన వారు చూస్తూ చూస్తుండగానే ఒక్కసారిగా కుప్ప కూలిపోతున్నారు. దీంతో ఏం జరిగిందో అని అందరూ గమనించి దగ్గరికి వెళ్లే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలా గుండెపోటుకు గురైన వారిని కాపాడేందుకు అసలు అవకాశం లేకుండా పోతుంది అని చెప్పాలి. సడన్ హార్ట్ ఎటాక్లకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలోకి వస్తూ ఉండడంతో ఇక ఇలాంటి తరహా వీడియోలు ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయానికి పెంచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.

 ఏకంగా 36 ఏళ్ళ ఆర్మీ జవాన్ ను గుండెపోటు బలి తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. టీ కామ్ గాడ్ జిల్లా మార్గవ గ్రామంలో జరిగింది. అయితే క్రికెట్ ఆడుతున్న సమయంలో ఆర్మీ జవాన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్ళగా చివరికి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా ఆర్మీ జవాన్ లాన్స్ నాయక్ వినోద్ ఉత్తరప్రదేశ్లోని సహాయన్ పూర్ లో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. సెలవులు నేపథ్యంలో స్వగ్రామానికి రాగా ఇలాంటి విషాదం జరిగింది. గతంలో కూడా ఇలా క్రికెట్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన యువకులు ఎంతోమంది ఉన్నారు. దీంతో క్రికెట్ ఆడితే ప్రాణం పోతుందా అనే భయం ప్రతి ఒక్కరిలో నిండిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: