కూతురిపైనే కోరిక పెంచుకున్న సవతి తండ్రి.. చివరికి ఓ రోజు?

praveen
ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. కామంతో కళ్ళు మూసుకుపోయిన నీచులు ఆడపిల్ల కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. అయితే ఇలా మహిళలను వేధింపులకు గురి చేసే వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకువచ్చినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా మార్పు రావడం లేదు అని చెప్పాలి. దీంతో అడుగడుగున ఆడపిల్ల భయంతోనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకప్పుడు బయట వ్యక్తులను వేధింపులు ఎదురైతే ఇక ఆ బాధను ఇంట్లో వాళ్లకు చెప్పుకునేవారు అమ్మాయిలు.

 కానీ ఇటీవల కాలంలో ఏకంగా ఇంట్లో వాళ్ళ నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్న నేపథ్యంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుంగిపోతున్న స్థితిలో ఉండిపోతున్నారు ఎంతో మంది ఆడపిల్లలు. ఇక్కడ ఏకంగా సవతి తండ్రి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. జెల్ పల్లికి చెందిన భార్యాభర్తలకు ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

 వారికి ఆరు సంవత్సరాల కూతురు కూడా ఉంది. అయితే వీరికి కాపురంలో కలహాలు తలెత్తడంతో ఇక భార్యాభర్తలు విడిపోయారు. ప్రస్తుతం కూతురు తల్లి వద్దే ఉంటుంది. అయితే ఆమె ఆరేళ్ల క్రితం 26 సంవత్సరాలు ఆటో డ్రైవర్ ను రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్త ద్వారా జన్మించిన కూతురుతో పాటు రెండో భర్తతో కలిసి జల్ పల్లి లో ఉంటుంది. అయితే రెండవ భర్త ద్వారా ఇతరు కూతురు జన్మించారు. పెద్దకూతురు మూడు సంవత్సరాలు.. చిన్న కూతురు ఒక సంవత్సరం వయస్సు ఉంది. అయితే తన భార్య మొదటి సంతానం ఆరేళ్ల బాలికపై రెండో భర్త అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఇదంతా గమనించిన మూడేళ్ల చిన్న కూతురు విషయాన్ని తల్లికి చెప్పేందుకు ప్రయత్నించింది. దీంతో తల్లి పెద్ద కూతురును ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: