ఓకే గ్రౌండ్లో రెండు క్రికెట్ మ్యాచ్లు.. చివరికి ప్రాణం పోయింది?

praveen
ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ ఎందుకో క్రికెట్ ని ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు క్రీడాభిమానులు. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు ఇక టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. అయితే కేవలం చూడటం వరకు మాత్రమే కాదు ఆడటం కూడా చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. కాస్త కాస్త కాలి సమయం దొరికింది అంటే చాలు దగ్గరలో ఉన్న మైదానంలోకి వెళ్లి బ్యాటు బంతి పట్టుకుని క్రికెట్ ఆడటం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక వీకెండ్ లో అయితే ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒకే మైదానంలో ఏకంగా రెండు మూడు మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు ఏ ఆటగాడు ఏ టీమ్ కి చెందిన ప్లేయర్ అన్నది కూడా అర్థం కాని విధంగా మారిపోతూ ఉంటుంది పరిస్థితి. అయితే ఇలా ఒకే మైదానంలో ఎక్కువ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక టీం ఆటగాడు కొట్టిన బంతి ఇక మరో జట్టు ప్లేయర్ కు తగిలి చివరికి గాయం బారిన పడే అవకాశం ఉంటుంది. ఇటీవలే ముంబైలో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఒకే గ్రౌండ్ లో రెండు క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించగా చివరికి ఒక జట్టు ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు.

 ముంబైలోని హతుంగాలో జరిగిన క్రికెట్ టోర్నీలో ఇలాంటి విషాదకర ఘటన జరిగింది అని చెప్పాలి. బంతి తగిలి జయేష్ సవాల అనే 52 ఏళ్ల ఫీల్డర్ ప్రాణాలు కోల్పోయాడు. కచ్చి వీసా ఓస్వాల్ వికాస్ లెజెండ్ కప్ పేరుతో 50 ఏళ్లకు పైబడిన వారికి ఇటీవలే టి20 నిర్వహించారు. అయితే గ్రౌండ్ సరిపడా లేకపోవడంతో ఒకే గ్రౌండ్లో రెండు మ్యాచ్లు నిర్వహించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పక్క మ్యాచ్లో బ్యాట్స్మెన్ కొట్టిన షాట్ దురదృష్టవశాత్తు ఇక మరో టీం ఆటగాడైన జయేష్ సవాల మెడ వెనక భాగంలో తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అతను మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: