అసలు ఈమె తల్లేనా.. నాలుగేళ్ళ కొడుకుని గోవాకి తీసుకెళ్లి?

praveen
ఈ లోకంలో తల్లి ప్రేమను మించింది మరొకటి లేదు అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే ఇక తల్లిలోని కల్మషం లేని ప్రేమను చూసినప్పుడు ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే కేవలం 9 నెలలు కడుపులో మోసి జన్మనివ్వడమే కాదు.. ఇక పుట్టిన తర్వాత కూడా కంటికి రెప్పలా పిల్లలను కాపాడుకుంటూ ఉంటుంది తల్లి. కానీ ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు మాత్రం ఏకంగా తల్లి ప్రేమకే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. సొంత బిడ్డల విషయంలోనే అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారు.


 చివరికి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలను కూడా కడతేర్చేందుకు వెనకాడని పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయ్. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఏకంగా నాలుగేళ్ల కొడుకుని ఓ మహిళ అత్యంత దారుణంగా చంపేసింది. ఇక బాడీని ముక్కలు ముక్కలుగా చేసి బ్యాగులో కుక్కి మరోచోటికి ప్రయాణించింది. అయితే ఇలా చేసింది సామాన్య మహిళా కూడా కాదు ఓ కంపెనీకి సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళ కావడం గమనార్హం. ఈ విషాదకర ఘటన  గోవాలో వెలుగులోకి వచ్చింది.


 బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల సూచన సేత్ మైండ్ ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ ని స్థాపించింది. ఇక ఆ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తుంది  అయితే ఇటీవలే ఆమె తన నాలుగేళ్ల కుమారుడుని తీసుకొని ఉత్తర గోవాలోని ఒక హోటల్ కి వెళ్ళింది. ఇక ఉదయం అక్కడ గదిని ఖాళీ చేసి టాక్సీలో కర్ణాటకకు బయలుదేరింది. గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అక్కడ రక్తపు మరకలు చూసి షాక్ అయ్యారు. వెంటనే హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. ఇక హోటల్ యాజమాన్యం పోలీసులకు విషయం తెలుపగా పోలీసులు సిసిటివి దృశ్యాలను పరిశీలించారు. హోటల్లో దిగినప్పుడు కుమారుడితో కలిసి కనిపించిన సుచన వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా వెళ్లడంతో అనుమానం వచ్చి ఇక టాక్సీ డ్రైవర్ సాయంతో సుచనాతో మాట్లాడారు పోలీసుల. దీంతో సుచన తన ఫ్రెండ్ ఇంటిదగ్గర కొడుకుని వదిలేసినట్లు చెప్పింది. కానీ పోలీసులు ఆరా తీయగా అది అబద్ధం అని తేలింది. చివరికి ఎంతో చాకచక్యంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె చేతిలో ఉన్న బ్యాగులో చిన్నారి మృతదేహం ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండడం చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఆమె సొంత కొడుకుని ఎందుకు చంపింది అన్న కారణాలు తెలియ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: