కండక్టర్ బుగ్గ కొరికిన ప్రయాణికుడు.. ఎందుకో తెలుసా?

praveen
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం కల్పించింది అన్న విషయం తెలిసిందే. దీంతో టిక్కెట్లు లేకుండానే ఎంతో మంది మహిళలు ప్రస్తుతం బస్సులో ప్రయాణిస్తున్నారు. అయితే ఇక మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో ఎన్నో చిత్ర విచిత్రమైన ఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలేమో సీట్లలో కూర్చుంటే డబ్బులు పెట్టి మేము నిల్చోవాలా అంటూ గతంలో ఒక వ్యక్తి చేసిన వీడియో వైరల్ గా మారింది.


 అంతేకాదు ఏ బస్సులో చూసినా మగవాళ్ళు ఇద్దరో ముగ్గురు ఉంటే పూర్తిగా మహిళలతోనే బస్సులను నిండిపోతున్నాయ్ అని చెప్పాలి. అయితే ఇటీవలే ఆదిలాబాద్ డిపోలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఏకంగా కండక్టర్ తో గొడవ పడిన ఒక ప్రయాణికుడు.. కండక్టర్ బుగ్గ కొరికి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. బస్సు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని పాండ్ర కావడ గ్రామానికి వెళ్ళింది. తిరిగి అదే దారిలో ఆదిలాబాద్ కు బయలుదేరింది. అయితే బోరి అనే గ్రామంలో అజీమ్ అనే వ్యక్తి బస్సు ఎక్కాడు. అయితే అతను అప్పటికే మద్యం మత్తులో ఉండడంతో బస్సు ఎక్కగానే కండక్టర్ తో గొడవపడ్డాడు.


 టికెట్ తీసుకున్న తర్వాత అందరిపై అరిచాడు. అయితే తనకు కూర్చోవడానికి సీట్ కావాలని కండక్టర్ పై అరిచాడు. అయితే బస్సు అప్పటికే రద్దీ ఉంది కూర్చోవడానికి సీట్లు లేవు. దీంతో సీట్లు లేవని దయచేసి సహకరించాలని అతన్ని కండక్టర్ సముదాయించాడు. అయితే తన డబ్బులు తనకు ఇచ్చేయాలని అజీమ్ ఫైర్ అరవడంతో ఇక మరో దారి లేక అతని డబ్బులు ఇచ్చేశాడు కండక్టర్. అయినప్పటికీ అతను ఊరుకోలేదు. బస్సు కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ బస్సు ఎక్కి కండక్టర్ తో గొడవపడ్డాడు. ఇతను కండక్టర్ బుగ్గ కొరికి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇక ఆ తర్వాత ప్రయాణికులు మందించడంతో బస్సు దిగిన అతను మళ్ళీ డిపో కి వచ్చి హంగామా చేయడంతో ఇక పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: