బర్త్ డే రోజు అలా చేయలేదని.. భర్తను చంపేసిన భార్య?

praveen
భార్యా భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒక్కసారి మూడు బంధం తో ఒక్కటైన తర్వాత వైవాహిక బంధం లో ఎన్ని సమస్యలు వచ్చినా సర్దుకు పోతు బ్రతకాల్సి ఉంటుంది. ఒకరికి ఒకరు తోడు నీడగా కష్ట సుఖాల్లో వెన్నంటే ఉండాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో భార్యా భర్తల మధ్య అన్యోన్యత అనేది ఎక్కడ కనిపించడం లేదు. కష్టాలు వచ్చినప్పుడు అండగా ఉండాల్సిన కట్టుకున్న వారు ఏకంగా దారుణంగా కడ తేరుస్తున్న ఘటనలు కూడా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 ఏకంగా కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధానికి తెరలేపి కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేస్తున్న వారు కొంతమంది అయితే.. చిన్న చిన్న గొడవలకే ఉన్మాదులుగా మారిపోతూ ప్రాణాలు తోడేస్తున్న వారు మరి కొంతమంది.. అయితే ఇంకొంతమంది అయితే ఏకంగా ఇలా కట్టుకున్న వారిని హత్యచేయడానికి గల కారణాల గురించి తెలిసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు.


 ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అంతేకాదు పెళ్లి అనే బంధం పై ఇప్పటివరకు అందరిలో ఉన్నఆలోచనలకు కూడా మార్చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా పుట్టినరోజు సందర్భంగా తనను దుబాయ్ ట్రిప్ కు తీసుకు వెళ్ళలేదు అన్న కారణంతో ఒక భార్య పసుపు కుంకాలు తెంచేసుకుంది. ఏకంగా భర్తను దారుణంగా హత్య చేసింది. నిఖిల్ కన్నా,  రేణుకలది ప్రేమ వివాహం. అయితే తన పుట్టినరోజు ను దుబాయ్ లో సెలబ్రేట్ చేయాలని భర్తను రేణుక కోరింది. కానీ దుబాయ్ కి తీసుకెళ్లక పోగా.. ఖరీదైన గిఫ్టులు కూడా ఇవ్వలేదని అతనితో గొడవ పడింది. ఈ క్రమంలోనే భర్త ముఖంపై పిడుగులు కురిపించడంతో అతను ప్రాణాలు వదిలాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: