ప్రేమ పెళ్లి.. అన్యోన్యంగా వైవాహిక బంధం.. కానీ అంతలో భార్య ఆత్మహత్య?

praveen
పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం అని చెబుతూ ఉంటారు. ఏకంగా కలకాలం కలిసి మెలిసి ఉండడానికి.. సంతోషంగా జీవితాన్ని గడపడానికి ఒక భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా పెళ్లి అనే బంధంతో ఒక్కటైన తర్వాత.. ఇక ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. అంతేకాదు కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలి. కానీ ఇటీవల కాలంలో మాత్రం భార్యాభర్తల బంధం లో ఎక్కడ అన్యోన్యత కనిపించడం లేదు.

 ఏకంగా పెళ్లి చేసుకొని హ్యాపీగా సంసారం చేయాల్సిన భార్యాభర్తల చిన్నచిన్న కారణాలతోనే చివరికి మనస్పర్ధలతో విడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు వారి బంధం మరింత బలపడుతుందని.. ఒకరి గురించి మరొకరికి మరింత ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంటుందని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల  కాలంలో భార్యాభర్తల మధ్య వస్తున్న చిన్నపాటి తగువలే చివరికి ఆత్మహత్యలు, హత్యలకు కారణాలుగా మారిపోతున్నాయి అని చెప్పాలి.

 ఇటీవల గుంటూరు జిల్లాలో కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తను వద్దని చెప్పిన వినకుండా భర్త బయటికి వెళ్లాడు అన్న కారణంతో.. భార్య ఆత్మహత్య చేసుకుంది. కళ్యాణి నగర్ ప్రాంతానికి చెందిన నాగూర్ భాష, జ్యోత్స్నలకు ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. ఇద్దరు ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అయితే వృత్తిలో భాగంగా ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. వీరి వైవాహిక జీవితం కూడా అన్యోన్యంగా సాగింది. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన చిన్నప్పటి గొడవ పెను విషాదానికి  కారణమైంది. బయటకు వెళ్లొద్దని భర్తకు ఎంత చెప్పినా అతను వినకపోవడంతో చివరికి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. అయితే జోత్స్నకి తల్లి ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అల్లుడుకి ఫోన్ చేసింది. అతను ఇంటికి వెళ్లి చూడగా భార్య ఫ్యాన్కు ఉరేసుకుంది. ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: