ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాకింగ్ కి వెళ్ళాడు.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీకి మనిషి బాగా అలవాటు పడిపోతున్నాడు. ఈ క్రమంలోనే టెక్నాలజీ ద్వారా ఎన్నో సౌకర్యాలను పొందగలుగుతున్నాడు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు ఇలా టెక్నాలజీకి పరిమితికి మించి అలవాటు పడటమే.. చివరికి ప్రాణాల మీదికి తెస్తూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మొబైల్ వాడే వారి సంఖ్య ఎంతలా పెరిగిపోయిందో.. ఇక ఇయిర్ ఫోన్స్ వాడే వారి సంఖ్య కూడా అంతే పెరిగిపోయింది.

 ఇయిర్ ఫోన్స్ పెట్టుకుని తమకు ఇష్టమైన పాటలు వింటూ ప్రతి చోటుకు వెళ్లడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఉదయం సమయంలో మార్నింగ్ వాక్ కి వెళ్లేవారు.. ఇలా చెవిలో ఇయిర్ ఫోన్స్ పెట్టుకొని వాక్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా తమ ఇష్టమైన పాటలు వింటుంటే మరింత ఎనర్జీ వస్తుందని కొంతమంది చెబుతూ ఉంటారు. ఎయిర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడం.. ఇక కొంతమంది రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాల బారిన పడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఇటీవల తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటన జరిగింది. ఇయిర్ ఫోన్ పెట్టుకొని వాకింగ్ చేయడమే అతని పాలిట శాపంగా మారిపోయింది.

 మక్తల్ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణమైన ప్రమాదం జరిగింది. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నవీన్ అనే యువకుడు రైల్వే ట్రాక్ పై వాకింగ్కు వెళ్ళాడు. అయితే మరోవైపు నుంచి రైలు వేగంగా దూసుకు వచ్చింది. కానీ అతని చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండడంతో రైలు హారన్ కూడా అతనికి వినిపించలేదు. దీంతో రైలు అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్ ఎడమవైపు శరీరం నుంచి విడిపోయి పట్టాలపై పడింది. అయితే ఇది గమనించిన స్థానికులు వెంటనే యువకుడిని తోలుత మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక మెరుగైన చికిత్స కోసం అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: