మరి ఇంత నిర్లక్ష్యమా.. చిన్నారి చావుకి కారణమైన తల్లి.. వీడియో వైరల్?
సజ్జనార్ తాజాగా ఓ వీడియో షేర్ చేస్తూ రోడ్డు దాటేటప్పుడు తమ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో రోడ్డు దాటుతున్నప్పుడు చూడాలని, సెల్ఫోన్లు వాడుతూ అజాగ్రత్తగా ఉండకూడదని అన్నారు. రోడ్డు దాటుతున్నప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల చేతులను అన్నివేళలా పట్టుకోవాలని ఆయన గుర్తు చేశారు.
సజ్జనార్ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇందులో ఒక తల్లి రోడ్డు పక్కన కూర్చొని మొబైల్ చూడటం మనం చూడవచ్చు. పక్కనే ఆమె పిల్ల కూడా ఉంది. తల్లి ఆ పిల్లను అసలు పట్టించుకోలేదు. దాంతో ఆ చిన్నారి రోడ్డు మధ్యలోకి వేగంగా వెళ్లింది. అటు వైపు నుంచి ఒక బైకర్ కూడా చాలా స్పీడ్ తో వస్తున్నాడు. క్షణ కాలంలో అతడు ఆ చిన్నారిని బైక్ తో బలంగా ఢీ కొట్టాడు. దాంతో ఆ చిన్నారి చాలా ఎత్తుకు ఎగిరి పడిపోయింది. బైకర్ కూడా కింద పడిపోయాడు. అది చూసి తల్లి ఒక్కసారిగా కంగుతున్నది, అనంతరం సెల్లు పక్కన పెట్టేసి ఏడవటం మొదలుపెట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి చనిపోయినట్లు తెలిసింది. ఈ వీడియో చూసిన చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిని తిట్టిపోస్తున్నారు. ఈ కడుపుకోత జీవితాంతం వెంటాడుతుందని కామెంట్లు చేస్తున్నారు.
సజ్జనార్ వీడియో పిల్లలకు రహదారి భద్రత ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. పిల్లలు ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు గురవుతారు, ఎందుకంటే వారు చిన్నవారు, ట్రాఫిక్ ప్రమాదాల గురించి తక్కువ అవగాహన కలిగి ఉంటారు. తమ పిల్లలను రోడ్లపై సురక్షితంగా ఉంచడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. వారు తమ పిల్లలకు రోడ్డు భద్రతా నియమాల గురించి బోధించడం, రోడ్డు దాటేటప్పుడు ఎల్లప్పుడూ వారి చేతులు పట్టుకోవడం, తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మంచి ప్రమాదాల నుంచి బయటపడొచ్చు.