ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు జాగ్రత్త.. వీడి తల ఎలా ఇరుక్కుందో చూడండి?

praveen
ఇటీవల కాలంలో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి పని విషయంలో ఈజీ మెథడ్ ని ఆలోచిస్తూ ఉన్నారు జనాలు. ఈ క్రమంలోనే కష్టపడకుండా పని పూర్తి చేయడం ఎలా అని ఆలోచిస్తూ వినూత్నమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఒకప్పుడు షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి సినిమా థియేటర్ల వరకు ఎక్కడికి వెళ్లినా కేవలం మెట్లు మాత్రమే కనిపించేవి. ఇక ఇలాంటి మెట్లు ఎక్కుతూనే వెళ్లాల్సిన చోటుకు వెళ్లేవారు. కానీ ఆ తర్వాత లిఫ్ట్ అందుబాటులోకి వచ్చింది. ఈ లిఫ్ట్ చివరికి అపార్ట్మెంట్ల వరకు కూడా చేరింది.

 కానీ ఇప్పుడు లిఫ్ట్ ట్రెండ్ పోయింది. ఎక్కడ చూసినా ఎస్కలేటర్ ట్రెండ్ వచ్చేసింది అని చెప్పాలి. దీంతో షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి సినిమా థియేటర్ల వరకు ఇక రైల్వేస్టేషన్లో కూడా ఎస్కలేటర్ అందుబాటులో ఉంది. ఈ ఎస్కలేటర్ ఎలా పనిచేస్తుందో అందరికీ తెలిసే ఉంటుంది. మొదటి మెట్టు మీద ఎక్కి నిలబడితే చాలు.. అదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా చివరి మెట్టు వరకు కూడా తీసుకెళ్తుంది. ఎంతోమంది జనాలు ఈ ఎస్కలేటర్ ని వాడుతూ మెట్లను ఎంతో ఈజీగా ఎక్కేయగలుగుతున్నారు.

 అయితే ఇలాంటి అధునాతన టెక్నాలజీని వినియోగించేటప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే అని నిరూపించే ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎస్కులేటర్ను వాడుతున్న జనాలు  అప్రమత్తంగా లేకపోతే ఏం జరుగుతుందో అన్న దానికి నిదర్శనం ఇక్కడ వీడియో  మారింది. ఏకంగా ఒక యువకుడి తల ఎస్కలేటర్ కి పక్కనే ఉన్న గోడకి మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో కుయ్యో మొర్రో అంటూ ఆ బాలుడు ఎంతగానో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇక మధ్యలో ఇరుక్కుపోయిన అతని తలను ఎంతో విజయవంతంగా బయటకు తీశారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: