కూతురిని గర్భవతి చేసిన తండ్రికి.. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?

praveen
ప్రతి మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా.. తండ్రి కూతుర్ల బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే తండ్రి తన కూతురులో తన తల్లిని చూసుకుంటే.. ఇక కూతురు తన తండ్రిని సూపర్ హీరో అని భావిస్తూ ఉంటుంది. అయితే ఇక కొడుకు విషయంలో కఠినంగా ఉండే తండ్రి అటు కూతురు విషయంలో మాత్రం అమితమైన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. కూతురికి ఏ కష్టం వచ్చినా తండ్రి అసలు తట్టుకోలేడు. ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాడు తండ్రి.


 అయితే ఇలా ప్రతిక్షణం కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తండ్రి ఇక్కడ కామాంధుడిగా మారిపోయాడు. ఏకంగా రక్తం పంచుకొని పుట్టిన కూతురు విషయంలోనే మృగంలా ప్రవర్తించాడు. చివరికి కూతురిని గర్భవతిని చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన విశాఖపట్నం జిల్లా మల్కాపురం ఎన్టీఆర్ కాలనీలో వెలుగు చూసింది. మానవ సంబంధాలు వావి వారసులు మరిచిపోయి మృగంలా మారిన ఆ తండ్రి తొమ్మిదో తరగతి చదువుతున్న కూతురిపై కొంత కాలం పాటు అత్యాచారం చేస్తూ వచ్చాడు.


 అయితే ఈ విషయాన్ని బయటకి పొక్కకుండా జాగ్రత్త పడిన తండ్రి చివరికి ఆ బాలిక గర్భం దాల్చడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది. ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశాఖ ఫోక్సో కోర్టులో నిందితున్ని హాజరు పరిచారు. అయితే కన్న కూతురుపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన కామాంధుడైన తండ్రి రామచంద్రరావుకి పొక్సో కోర్టు సంచలన శిక్ష విధించింది  జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 28 2020 కేసు నమోదు అయ్యింది. అయితే 15 ఏళ్ల మైనర్ కూతురుపై అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. ఇక కేసు కోసుల విచారణ జరిగింది. ఈ క్రమంలోనే కామాంధుడైన తండ్రి రామచంద్రరావుకి జీవిత ఖైదు విధించిన కోర్టు బాధితురాలికి పది లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: