పంజాబ్‌లో పరువు హత్య.. కూతురిని చంపి.. అంతటితో ఆగకుండా?

praveen
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రి కూతురి పాలిట యముడు అయ్యాడు. పదహారేళ్ల బిడ్డను అత్యంత ఘోరంగా చంపేసి ఆమె శరీరాన్ని తన బైకు వెనక కట్టి ఊరంతా తిప్పాడు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ గానూ మారాయి. కూతురు శవాన్ని ఊరంతా ఈడ్చి వెళ్లిన తర్వాత సదరు తండ్రి ముచ్చల్ గ్రామంలోని రైలు పట్టాలపై పడేసాడు. ఆ కూతురు తెలిసో తెలియకో చేసిన తప్పును మన్నించి బుద్ధి చెప్పాల్సింది. కానీ ఈ తండ్రి మృగంగా మారి ఆమెను మంచి కిరాతకంగా చంపేశాడు.

గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ షాకింగ్ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. వారి కథనం ప్రకారం, దల్బీర్ సింగ్ అలియాస్ బావు అనే వ్యక్తి కుమార్తె ఎవరికీ చెప్పకుండా బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. మళ్లీ మరుసటి రోజు అంటే గురువారం తిరిగి ఇంటికి వచ్చింది. అయితే తన కూతురు చెప్పకుండా ఎవరో యువకుడి దగ్గరకి వెళ్ళిపోయిందని దల్బీర్ సింగ్ కోపంతో రగిలిపోయాడు. కూతురు ఇంటికి రాగానే ఆమెను కొట్టడం ప్రారంభించాడు. ఆ క్రమంలోనే చేతికి పదునైన ఆయుధం దొరకడంతో దానితో ఆమెపై విచక్షణారహితంగా పొడిచేసాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకుండా వారిని ఒక రూమ్ లో వేసి తాళం వేశాడు.

కూతురు ఎంత బతిమిలాడినా అతడు ఆమెను కసి తీరా పొడిచి చంపేశాడు. ఆపై బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లాడని మృతురాలి తాత జోగిందర్ సింగ్ నేషనల్ మీడియాకి తెలిపాడు. దల్బీర్ సింగ్ ఒక నిహాంగ్ సిక్కు అని, కూలీగా పనిచేస్తున్నాడని తారక్కా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అవతార్ సింగ్ పేర్కొన్నారు. ఇలాంటి కిరాతకమైన హత్య జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అయితే ఇదో ఒక పరువు హత్య తర్వాత తెలిసింది. శుక్రవారం ఈ కిరాతక తండ్రిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టుకు హాజరైన సమయంలో పశ్చాత్తాపం చెందని తండ్రి గౌరవంగా బతుకుతున్న తన పరువును తన కూతురు గంగలో కలిపేసినట్లు తెలిపాడు. ముచ్చల్‌కు చెందిన యువతులు ఇలాంటి పనులు చేస్తూ అందరికీ తలంపులు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. తన అమ్మాయిలా వేరొకరి ఇంటికి వెళ్లి తప్పుడు పనులు ఎవరూ చేయకూడదని తాను అనుకున్నట్లు పేర్కొన్నాడు. అందరి అమ్మాయిలను భయపెట్టాలనే ఉద్దేశంతో తన కూతురి మృతదేహానికి బైక్‌కి కట్టి ఈడ్చుకెళ్ళానని పేర్కొన్నాడు. అతని సమాధానాలు న్యాయమూర్తిని కూడా ఒకింత షాక్‌కి గురి చేశాయి. ధర్మాసనం అతనికి ఒకరోజు పోలీసు రిమాండ్ మంజూరు చేసింది. శనివారం అతన్ని మళ్లీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: